E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు ఆఖరి కెప్టెన్ గా కళ్యాణ్..మామూలు ట్విస్ట్ కాదుగా?

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు ఆఖరి కెప్టెన్ గా కళ్యాణ్..మామూలు ట్విస్ట్ కాదుగా?
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈ కార్యక్రమం ప్రస్తుతం 12 వ వారం ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక 13వ వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్కులు కూడా పోటాపోటీగా జరిగాయి. ఈ పోటీలలో భాగంగా ఇదివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరిని హౌస్ లోకి పంపించి ఈ కెప్టెన్సీ టాస్కులను నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇదివరకు విడుదల చేసిన ప్రోమోలు చూస్తుంటే మాత్రం చివరివారం కెప్టెన్సీ అవ్వటం కోసం కంటెస్టెంట్లు కూడా పెద్ద ఎత్తున పోటీపడినట్లు స్పష్టం అవుతుంది. మరి 13వ వారంలో కెప్టెన్ గా నిలవడం కోసం కంటెస్టెంట్లు కూడా గట్టి పోటీ ఇచ్చారు. మరి ఈ వారం హౌస్ లో కెప్టెన్ గా ఎవరు నిలవబోతున్నారనే విషయానికి వస్తే…

కెప్టెన్సీ టాస్క్ కు పోటీపడిన పవన్, కళ్యాణ్..

ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా రీతు, సంజన, దివ్య, ఇమ్మానియేల్, డిమోన్ , కళ్యాణ్ ఉన్నారు. వీరంతా కూడా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పెద్ద ఎత్తున పోటీ పడుతూ కెప్టెన్సీ టాస్కులలో విజయం సాధించారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్కులలో నిలిచిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ మరొక టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ టాస్క్ లో భాగంగా కళ్యాణ్ సెలెక్ట్ కావడంతో చివరివారం కెప్టెన్ గా ఎంపిక అయినట్టు తెలుస్తుంది. ఈ కెప్టెన్సీ టాస్కులలో భాగంగా చివరిగా పవన్ కళ్యాణ్ మాత్రమే మిగలడంతో వీరిద్దరి మధ్య జరిగిన టాస్క్ లో భాగంగా కళ్యాణ్ గెలవడంతో కళ్యాణ్ మరోసారి కెప్టెన్ గా ఎన్నికైనట్టు తెలుస్తుంది.

రెండోసారి కెప్టెన్ గా కళ్యాణ్..

Advertisement

ఇకపోతే ఇదివరకే కళ్యాణ్ కెప్టెన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైర్ స్ట్రామ్ వచ్చినప్పుడు కళ్యాణ్ మొదటిసారి కెప్టెన్ అయ్యారు. ఇక ఈ సీజన్ లో చివరి కెప్టెన్ గా కళ్యాణ్ నిలవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు జరగబోయే ఈ ఎపిసోడ్లో భాగంగా కళ్యాణ్ మరోసారి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

డేంజర్ జోన్ లో దివ్య..

Advertisement

ఇక 11వ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో చాలా ఎంటర్టైనర్ గా ఈ కార్యక్రమం కొనసాగింది. ఇక 12వ వారంలో భాగంగా కెప్టెన్సీ టాస్క్ కోసం గత సీజన్లలో కెప్టెన్ గా నిలిచిన ప్రియాంక, మానస్, ప్రేరణ, యావర్, ప్రొఫైల్, హారిక వంటి కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం కంటెస్టెంట్లతో పెద్ద ఎత్తున పోటీ పడుతూ సందడి చేశారు. ఇలా మాజీ కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టడంతో 12వ వారం కూడా చాలా వినోదాత్మకంగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఇకపోతే గతవారం ఎలిమినేషన్ లేకుండా నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లు సేవ్ అయ్యారు కానీ ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే డేంజర్ జోన్ లో ఉన్న సంజన, దివ్య, రీతూలలో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: Akhanda 2 Roxx Car: అఖండ2లో బాలయ్య నడిపిన పవర్ ఫుల్ కారు ఇదే.. దీని ప్రత్యేకతలు చూశారా?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×