E-Paper
Advertisement

Mahashivratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం.. కొత్తగా చేసేవారు చేయకూడని పొరపాట్లు ఇవే

Mahashivratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం.. కొత్తగా చేసేవారు చేయకూడని పొరపాట్లు ఇవే
Advertisement

Mahashivratri Fasting: మహా శివ రాత్రి కేవలం ఒక పండగ మాత్రమే కాదు.. అది ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుద్ధి చేసుకునే ఒక గొప్ప పర్వదినం. ముఖ్యంగా శివరాత్రి ఉపవాసం ఉండటం వల్ల శారీరక శుద్ధితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. మీరు మొదటి సారి శివరాత్రి ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నట్లయితే.. కొన్ని నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

శివ రాత్రి పర్వదినాన శివయ్యను పూజించడం, జాగరణ చేయడం ఎంత పుణ్యమో, ఉపవాసం ఉండటం కూడా అంతే విశిష్టమైనది. అయితే మొదటిసారి ఉపవాసం చేసేవారికి ఆహార నియమాలు, పూజా విధానంపై కొన్ని సందేహాలు ఉండవచ్చు. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు. నియమబద్ధంగా ఉంటూ శివనామ స్మరణలో మునిగిపోవడం. మీ మొదటి శివరాత్రి ఉపవాసం విజయవంతంగా.. భక్తి శ్రద్ధలతో సాగడానికి ఈ క్రింది 8 విషయాలను తప్పక గుర్తుంచుకోండి.

Advertisement

తొలిసారి శివరాత్రి ఉపవాసం చేసేవారు గుర్తుంచుకోవాల్సిన 8 విషయాలు:

1. మీ శరీరం గురించి తెలుసుకోండి:
ఉపవాసం ప్రారంభించే ముందు మీ ఆరోగ్య స్థితిని గమనించండి. మీరు ఏదైనా అనారోగ్యంతో ఉన్నా లేదా మందులు వాడుతున్నా పూర్తి నిరాహార దీక్ష (నీరు కూడా తాగకుండా ఉండటం) చేయకూడదు. పండ్లు లేదా పాలు తీసుకుంటూ చేసే ‘ఫలాహార’ ఉపవాసం మొదటిసారి చేసేవారికి ఉత్తమం.

Advertisement

2. సంకల్పం చెప్పుకోవడం:
శివరాత్రి రోజు ఉదయాన్నే.. స్నానం చేసి, పూజా గదిలో దీపం వెలిగించి ఉపవాసం ఉంటున్నట్లు సంకల్పం చెప్పుకోవాలి. “ఓ శివయ్య! నా భక్తిని స్వీకరించి, ఈ ఉపవాసం నిర్విఘ్నంగా పూర్తి చేసేలా దీవించు” అని మనసులో ప్రార్థించండి. మానసిక దృఢత్వం ఉపవాసాన్ని సులభతరం చేస్తుంది.

3. నీరు, ద్రవాహారం:
శరీరం డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం) కాకుండా చూసుకోవడం ముఖ్యం. రోజంతా మంచి నీరు, కొబ్బరి నీళ్లు లేదా పలచని మజ్జిగ తీసుకోవచ్చు. ఇది మీ మెదడును చురుగ్గా ఉంచుతుంది. అంతే కాకుండా ఉపవాసం వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది.

4. ఆహార నియమాలు:
శివరాత్రి ఉపవాసంలో.. ధాన్యాలు (బియ్యం, గోధుమలు, పప్పులు) తీసుకోకూడదు. ఒక వేళ మీరు నీరసంగా అనిపిస్తే.. ఉడికించిన దుంపలు (సగ్గుబియ్యం, కందగడ్డ), పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ముఖ్యంగా.. ఉప్పుకు దూరంగా ఉండాలి. అవసరమైతే సైంధవ లవణం వాడవచ్చు.

5. శివనామ స్మరణ, జాగరణ:
ఉపవాసం ఉంటూ సినిమాలు చూడటం లేదా కబుర్లు చెప్పుకోవడం సరికాదు. రోజంతా “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. రాత్రి వేళ శివాలయాల్లో.. జరిగే అభిషేకాలను చూడటం లేదా శివ పురాణం చదువుతూ జాగరణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

6. కోపం, నెగిటివ్ ఆలోచనలకు దూరం:
ఉపవాసం అంటే బాహ్య ఆహారాన్ని వదలడమే కాదు. అంతర్గత వికారాలైన కోపం, అసూయ, అబద్ధాలను కూడా వీడాలి. మౌనంగా ఉండటానికి ప్రయత్నించడం వల్ల శక్తి ఆదా అవుతుంది. ధ్యానం చేయడం సులభం అవుతుంది.

Also Read: మీ పూజా గదిలో ఈ మార్పులు కనిపిస్తే.. శివుడు ప్రసన్నమైనట్లే!

7. పూజ, అభిషేకం:
వీలైతే శివాలయానికి వెళ్లి లింగానికి అభిషేకం చేయండి లేదా ఇంట్లోనే శివలింగానికి పాలు, తేనె, నీటితో భక్తితో అభిషేకం చేయండి. బిల్వ పత్రాలను సమర్పించడం శివునికి అత్యంత ప్రీతికరం. భక్తితో.. సమర్పించే ఒక గ్లాసు నీరు కూడా పరమేశ్వరుడిని ప్రసన్నం చేస్తుంది.

8. ఉపవాస విరమణ:
మరుసటి రోజు ఉదయం స్నానం చేసి, పూజ ముగించిన తర్వాతే ఉపవాసం విరమించాలి. విరమించేటప్పుడు ఒకే సారి ఒకే సారి ఎక్కువ ఆహారం తీసుకోకండి. తేలిక పాటి ఆహారంతో మొదలుపెట్టండి. చతుర్దశి తిథి ఉన్నంత వరకు నియమాలను పాటించడం శ్రేయస్కరం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×