BigTV English

Bommala Koluvu:బొమ్మల కొలువు సంప్రదాయం ఎలా మొదలైంది

Bommala Koluvu:బొమ్మల కొలువు సంప్రదాయం ఎలా మొదలైంది

Bommala Koluvu:ఆంధ్రదేశంలో ఈ బొమ్మల కొలువు సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా పెడతారు. ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు. మరికొందరు సంక్రాంతికి ఈ కొలువు పెడతారు. బొమ్మలు పెట్టడం, బొమ్మలు నిలపడం, బొమ్మలు ఎత్తడం, అనే వ్యవహారం ప్రాంతీయభేదాన్ని బట్టి ప్రయోగిస్తూ ఉంటారు. దసరాకు బొమ్మలు పెట్టడం, సంక్రాంతికి గొబ్బిళ్ళు, దీపావళికి బాణాసంచా ప్రత్యేకమైన విషయాలు. కొంచెం దృష్టి పెట్టి చూస్తే బొమ్మల కొలువు పెట్టడం, గొబ్బిళ్ళు పెట్టడం కేవలం ఆడపిల్లలు, అందునా కన్నెపిల్లలు నిర్వహించేవి గుర్తించవచ్చు.


ఆడపిల్లలు ప్రధానంగా ఈ బొమ్మల కొలువు పెట్టడానికి అధికారం కలవాళ్ళు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబాలలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. ఆడపిల్ల గల కుటుంబంలో వాళ్ళి ఆమె చేత ఈ బొమ్మలు పెట్టిస్తారు. ఇంట్లో పెద్దలందరూ పూనుకొని బొమ్మలనుఒక క్రమంలో మెట్లు మెట్లుగా అమర్చిపెడతారు. చెక్కతో మెట్ల బల్ల చేయించి పెట్టుకుంటారు కొందరు. ఈ బల్ల మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఉంటాయి. బల్లను కేవలం తెల్లటి గుడ్డతోనే కప్పుతారు. బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. పంచాంగం బ్రాహ్మడు, పెద్ద ముత్తైదువ, తల్లీ పిల్ల, ఆవూ దూడ వంటివి కచ్చితంగా ఉంటాయి

గతంలో బొమ్మలు కొలువుకి ఇప్పటికీ తేడా వచ్చింది. అసలు పద్దతుల్ని పక్కన పెట్టేశారు. శ్రీమద్బాగవంతో నేల నుంచి ఆకాశం వరకు ఉన్న ఎత్తుని ఏడు భాగాలుగా విభజించి చూపించాడు ఆంజనేయుడు . నేల నుంచి ఆకాశం ఉన్న వరకు ఎత్తులో మొదటి ఎత్తులో పిచ్చుకలు, రెండో ఎత్తులో కాకులు , మూడో ఎతులో భాస పక్షులు, నాలుగో ఎత్తులో డేగలు, ఐదో ఎత్తులో గద్దలు తర్వాత స్థానంలో రాజహంసలు, ఏడో ఎత్తులో గరుక్మంతుడు ఎగుతారు. ఈ ఏడు ఎత్తులే బొమ్మలు కొలువుకు మూలం . ఏ వరుసలో ఏ బొమ్మలు పెట్టాలో ఎందుకు పెట్టాలో పెద్దలు చెప్పారు.
ఈ బొమ్మల కొలువు పెట్టడం అనేది కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సంస్కృతీ సంపన్నమై సంప్రదాయ పరిరక్షణతో పాటుగా కళాత్మక దృష్టినీ పెంపొదిస్తుంది.


బొమ్మలన్నీ పెట్టెల్లో పాత పట్టుగుడ్డలు చుట్టి దాచడం ఒక పని, ఒక కళ. బొమ్మలకు ప్రత్యేకం చెక్కపెట్టెలు ఉండి, బొమ్మల పెట్టెలు ఆడపిల్లలకు బొమ్మలతో సగా సారె పెట్టే ఆచారం ఉండేది. బొమ్మల కొలువు పెట్టేందుకు బొమ్మల పెట్టె తెరవడం ఒక సంబరం.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×