BigTV English

Sankranti Day: సంక్రాంతి రోజు గంగా స్నానం సెంటిమెంట్

Sankranti Day: సంక్రాంతి రోజు గంగా స్నానం సెంటిమెంట్

Sankranti Day:మకర సంక్రాంతి రోజున గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఏడు జన్మల పాపాలు పోతాయని చెబుతారు.గంగాస్నానానికి వెళ్లలేకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలని చెబుతారు. దీని వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది . కపిల మహర్షి నాటి కాలంలో గంగాసాగర్ దగ్గర ఆశ్రమం నిర్మించి తపస్సు చేసుకునేవాడు.నాటి రోజుల్లో సాగర రాజు కీర్తి మూడు లోకాలలోనూ వ్యాపించింది. రాజులందరూ సాగరుడు చేసే దానధర్మాలను, సత్కార్యాల మహిమను గానం చేసేవారు. దీనిని చూసిన స్వర్గలోకపు రాజు ఇంద్రుడు కలత చెందేవాడు. సాగర రాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన సమయంలో ఇంద్రుడు అశ్వమేధ యాగ గుర్రాన్ని దొంగతనంగా కపిల ముని ఆశ్రమం దగ్గర కట్టేశాడు.


గుర్రాన్ని వెతకడానికి సాగర రాజు తన 60 వేల మంది కుమారులను పంపాడు. వారంతా గుర్రాన్ని వెతుక్కుంటూ కపిల ముని ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ అశ్వమేధ యాగం కోసం తెచ్చిన గుర్రాన్ని చూసి కపిలముని దొంగతనం చేశారని ఆరోపించారు. ఈ నిందను చూసి కోపంతో కపిల ముని సాగర రాజు 60 వేల మంది కుమారులందరినీ కాలి బూడిద అవుతారంటూ శపించాడు. సాగరరాజు తన కుమారులను క్షమించాలని కపిల మునిని వేడుకుంటాడు. అప్పుడు కపిల ముని అతనితో నీ కుమారులందరి మోక్షానికి ఒకే ఒక మార్గం ఉందని సెలవిస్తాడు. మోక్షదాయిని అయిన గంగను భూమిపైకి తీసుకువస్తే శాప విముక్తి కలుగుతుందని చెబుతాడు. సాగర రాజు మనవడు రాజు అన్షుమాన్, గంగామాతని భూమిపైకి తీసుకువచ్చే వరకు తమ రాజవంశానికి చెందిన ఏ రాజు శాంతియుతంగా కూర్చోకూడదని కపిల ముని సూచనపై ప్రతిజ్ఞ చేసి తపస్సు చేయడం ప్రారంభించారు.

రాజు అన్షుమాన్ మరణం తరువాత, భగీరథుడు గంగామాతను తన తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు, తద్వారా శివుడు గంగామాతను తన జఠాఝూటం ద్వారా భూమిపైకి దిగేలా చేశాడు. గంగామాతను కేశవుల్లో పెట్టుకుని శివుడు గంగాధరుడయ్యాడు. గంగామాత భూమిపైకి దిగింది. ముందు భగీరథ రాజు వెళుతుండగా వెనుక భూమిపై గంగామాత ప్రవహించడం ప్రారంభించింది.భగీరథుడు గంగను కపిల ముని ఆశ్రమానికి తీసుకువచ్చాడు, అక్కడ గంగామాత సాగర రాజు 60 వేల మంది కుమారులకు మోక్షాన్ని ఇచ్చింది. సాగర రాజుకు 60 వేల మంది పుత్రులకు గంగామాత మోక్షాన్ని ఇచ్చిన రోజే మకర సంక్రాంతి అని చెబుతారు అక్కడి నుండి గంగ ముందుకు సాగి సముద్రాన్ని చేరింది.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×