BigTV English
Advertisement

Malavya Raja Yoga: మాలవ్య రాజయోగం.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం

Malavya Raja Yoga: మాలవ్య రాజయోగం.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం

Malavya Raja Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపద, ఆస్తి, ఆనందం, విలాసవంతమైన జీవనశైలికి కారకంగా చెబుతుంటారు. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, ఆనందానికి లోటు ఉండదు. అదే సమయంలో బలహీనమైన శుక్రుడు ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు సృష్టిస్తాడు. శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహంగా చెబుతుంటారు. అందుకే శుక్రుడు శుభ స్థానంలో ఉంటే లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా అందుతాయి.


ప్రస్తుతం శుక్రుడు, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జులై 31 నుంచి శుక్రుడు సింహ రాశిలో సంచరించనున్నాడు. శుక్రుడు రెండు నెలల తర్వాత తన సొంత రాశిలోకి ప్రవేశిస్తాడు. 28 రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశి .మార్చుకుంటాడు. 18 సెప్టెంబర్ మధ్యాహ్నం 2:24 గంటలు తన సొంత రాశి తులా రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. 13 అక్టోబర్ 2024 వరకు ఈ రాశిలోనే శుక్రుడు ఉంటాడు. శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగం చాలా శుభప్రదమైందిగా చెబుతుంటారు. దీని కారణంగా కొన్ని రాశుల వారు చేసిన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. మాలవ్య రాజయోగం ఏ రాశుల వారకి ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేషరాశి వారు మాలవ్య రాజయోగం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ప్రేమ సంబంధ విషయాల్లో కూడా మాధుర్యం పెరగిపోతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడేందుకు అవకాశం ఉంది. సంపదలో పెరుగుదల బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. ఆస్తి , భూమిలో వృద్ధి ఉంటుంది. మీరు ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతి సాధించే అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితులు కూడా బలంగా ఉంటాయి. అవివాహితులకు వివాహాలు స్థిరపడతాయి.
వృశ్చిక రాశి:
మాలవ్య రాజ యోగం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మాలవ్య రాజయోగం వల్ల మీరు ఉద్యోగం, వ్యాపారంలో గొప్ప విజయాన్ని కూడా పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. మీరు కెరీర్‌కు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. పూర్వీకుల ఆస్తి వారసత్వంగా మీకు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం, ప్రేమ చాలా పెరుగుతుంది. ఈ కాలంలో మీకు కన్న కలలు నిజం అవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంది.

Also Read: అంగారకుడి సంచారంతో 5 రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి


కుంభ రాశి:
కుంభరాశి వారు తమ సొంత రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఎంతో ప్రయోజనాన్ని పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం మీకు అందుతుంది. కెరీర్‌లో విజయాలను సాధిస్తారు. వస్తు సౌకర్యాలు, సంపద బాగా పెరుగుతాయి. సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ జీవితం కూడా మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

Related News

Vastu Tips: ఉదయం లేవగానే.. ఈ వస్తువులు చూస్తే సమస్యలు కోరి కోని తెచ్చుకున్నట్లే ?

Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా.. ఈ దిశలో మొక్కలు పెట్టకూడదు !

Nandi in Shiva temple: శివాలయాల్లో నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి?

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Big Stories

×