BigTV English

OPPO A3x: ఇదేక్కడి మాస్ రా మావ.. రూ.12,499కే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

OPPO A3x: ఇదేక్కడి మాస్ రా మావ.. రూ.12,499కే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

OPPO A3x smartphone to launch in India soon: ప్రముఖ టెక్ బ్రాండ్ ఒప్పో దేశీయ మార్కెట్‌లో తన హవా చూపిస్తుంది. రకరకాల వేరియంట్లను లాంచ్ చేస్తూ అదరగొడుతోంది. ఇప్పటికే చాలా మోడళ్లను దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఈ నెల మొదట్లో అంటే జూలై 2న ఒప్పో కె12 ఎక్స్ 5జీని లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇప్పుడు మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ సారి మరిన్ని అధునాతన ఫీచర్లను తమ కొత్త ఫోన్‌లో అందిస్తున్నట్లు తెలిపింది.


కంపెనీ తన లైనప్‌లో ఉన్న మరో ఫోన్ ‘ఒప్పో ఏ3ఎక్స్‌’ను త్వరలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, వేరియంట్స్, ధరతో సహా ఇతర వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో దేశీయ మార్కెట్‌లో లాంచ్ కానుంది. అందులో 4/64 జీబీ వేరియంట్, 4/128 జీబీ వేరియంట్‌లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో 4/64 జీబీ వేరియంట్ కేవలం రూ.12,499లు, అలాగే 4/128 జీబీ వేరియంట్‌ రూ.13,499గా కంపెనీ నిర్ణయించింది.

Also Read: 12 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అతి చౌక ధరలో ఒప్పో 5జీ ఫోన్..!


కాగా ఈ ఫోన్ మొత్తం మూడు కలర్ వేరియంట్‌లలో రానుంది. స్టార్ లైట్ వైట్, స్పార్కిల్ బ్లాక్, స్టార్రీ పర్పుల్ కలర్ ఆప్షన్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఒప్పో ఏ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ 1604×720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 120hz రిఫ్రెష్ రేట్‌‌తో వస్తుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌ను కలిగి ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కంపెనీ అందించనుంది. ఇక

ఆప్టిక్స్ విషయానికొస్తే.. కంపెనీ ఈ ఫోన్‌లో 32 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించింది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందు వైపు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. అంతేకాకుండా దీని బ్యాటరీ విషయానికొస్తే.. కంపెనీ ఇందులో 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5100 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్‌ 14.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఇందులో ఐపీ54 రేటింగ్‌ను అందించనున్నారు.

Related News

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Xiaomi 17 Pro: 5x జూమ్, 6,300mAh బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 17 ప్రో లాంచ్

Amazon Xiaomi 14 CIVI: షావోమీ 14 సివీపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.17000 డిస్కౌంట్!

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Big Stories

×