BigTV English

Mannarasala Nagaraja temple : కేరళలో కాలకూట సర్పాలు ఉండే క్షేత్రం ఏది?

Mannarasala Nagaraja temple :  కేరళలో కాలకూట సర్పాలు ఉండే క్షేత్రం ఏది?
Mannarasala Nagaraja temple


Mannarasala Nagaraja temple : మందార పూల చెట్టు ఉంటే పాములు వస్తాయంటారు. మందార పూలకి నాగులకి సంబంధం ఉంది. కేరళలోని ఓ ప్రాంతానికి మందాల మాల అని పేరు ఉంది. అది ప్రస్తుతం మన్నారసేలగా మారింది. ఒక్క మొక్క కూడా మొలవవి ప్రాంతం అది. కారణం అక్కడ లవణమే. కాని అలాంటి ప్రాంతం పచ్చగా మారిపోయింది. ప్రకృతి ప్రేమికుల్ని కట్టి పడేలా ఉంది ఆ ప్రాంతం . సుందరమైన ప్రాంతగా అది పచ్చగా ఉండటానికి కారణం కాలకూట విషమే. ఈ ప్రాంతంలో 30వేలకి పైగా సర్పాల సంచించే ప్రాంతంగా చరిత్రకెక్కింది. చిత్ర విచిత్రమైన నాగులు ఈనాటికి సంచరించే ప్రాంతంగా మారింది.

పురాణాల ప్రకారం ఇది ఒకప్పుడు సముద్రం ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ నేలంతా సహజంగానే ఉప్పు నిండి ఉండేది. లవణీయత వల్ల కూరగాయలు కూడా పండలేదు. ప్రజలు అక్కడి నుంచి వలసపోయారు. దీంతో పరశురాముడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసి ఫలితాన్ని సాధిస్తాడు. కాలకూట విషయాన్ని ఆ నేలంతా నింపితే నేల మాములుగా మారుతుందని సెలవిచ్చాడట. అప్పుడు పరశురాముడు సర్పరాజుని ప్రసన్నం కోసం మళ్లీ తపస్సు చేసి మెప్పిస్తాడు. క్రూరమైన సర్పాల విషంతో ఆ ప్రాంతమంతా నిండిపోయేలా సర్పరాజు ఆశీర్వదిస్తాడు. అప్పటి నుంచి ఈ భూమి పంటలు పండేందుకు అనువుగా తయారై నివాసయోగ్యంగా మారింది.


సంతానం లేని వారు ఇక్కడ గుడికి వచ్చి పూజ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందుతారని విశ్వాసం బలంగా ఉంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో మనం కానీ వినీ ఎరుగని సర్పాలు తిరుగుతూ ఉంటాయి. కానీ ఎవరికి ఎలాంటి హానీ తలపెట్టవు. ఇదంతా దేవుడి మహిమేనని భక్తుల విశ్వాసం. మన్నారసాల శ్రీ నాగరాజ క్షేత్రం నైరుతి కేరళలో ఉన్న పురాతన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతంది.. ప్రపంచంలోని అన్ని సర్ప పూజా స్థలాలలో ఉన్నతమైనది కూడా.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×