BigTV English

Navgraha:నవగ్రహ పూజలకు ప్రత్యేకం ఈఆలయం

Navgraha:నవగ్రహ పూజలకు ప్రత్యేకం ఈఆలయం

Navgraha:పూర్వం నుంచి అస్సాం జ్యోతిష్య శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికీ నెలవుగా వుండేది. అందుకే అస్సాంకి ప్రాగ్జోతిష్యపురం అనే పేరు వచ్చిందంటారు. అసోంలోని నవగ్రహ ఆరాధన ఆలయం ప్రత్యేకమైంది. గౌహతి నవగ్రహ దేవాలయం నవగ్రహాల నుండి ఆశీర్వాదం కోరుకునే భక్తులకు ప్రసిద్ధి. కాళికా పురాణం ప్రకారం బ్రహ్మ దేవుడు ఇంద్రలోకంతో సమానమైన నగరాన్ని సృష్టించాలని ప్రాగ్జోతిష్యపురాన్ని నిర్మించాడట.


భక్తులు ప్రార్థనలు, పూజలు నిర్వహించి, దేవతలకు పూలు, పళ్లు, మిఠాయిలు సమర్పిస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రులు, శివరాత్రి, మకర సంక్రాంతి వంటి శుభ సందర్భాలలో ఆలయం రద్దీగా ఉంటుంది. నవగ్రహాల ఆశీర్వాదం కోసం నవగ్రహ పూజకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి . పూజారి మంత్రాలను పఠిస్తూ దేవతలకు వివిధ పదార్థాలను సమర్పిస్తారు. ఈ పూజలోఒక్కో గ్రహానికి సంబంధించిన ఒక్కో రకమైన పదార్ధాలను విడివిడిగా పెట్టి పూజిస్తారు.

మానవుని జీవిత గమనాన్ని నిర్దేశించే నవగ్రహాలకి ఎంతో ప్రాముఖ్యత వున్నది. గ్రహ సంచారాల వలన మనుష్యల జీవితాల్లో సుఖ దుఃఖాల సంఘటనలు ఏర్పడతాయని హిందువుల నమ్మకం. గౌహతి నవగ్రహ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ వార్షిక నవగ్రహ ఉత్సవం. నవంబరు లో తొమ్మిది రోజుల పాటు పండుగ వాతావరణం ఉంటుంది. దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పండుగకు దేశం నాలుగు వైపుల భారీ సంఖ్యలో వస్తుంటారు. నవగ్రహ ఉత్సవాలతో పాటు, ఈ ఆలయం దీపావళి, దుర్గాపూజ వంటి ఇతర ముఖ్యమైన హిందూ పండుగలను కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు.


గౌహతి నవగ్రహ దేవాలయం హిందువులకి ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
చాలా కొద్ది చోట్ల నవగ్రహాలు భార్యలతోసహా, ఇంకా కొద్ది చోట్ల పరివార దేవతలతో సహా దర్శనమిస్తారు. కానీ ఇక్కడి విశేషమేమిటంటే నవ గ్రహాలు లింగ రూపంలో వుంటాయి. ఆలయం యొక్క నిర్మలమైన వాతావరణం, అందమైన వాస్తు సంపద, సాంస్కృతిక ప్రాముఖ్యత పర్యాటకులకు అద్భుతమైన గమ్యస్థానంగా మారింది. ఆలయానికి వెళ్లే మార్గంలో గౌహతి యొక్క సుందరమైన అందాలను ఆస్వాదించవచ్చు.

Tags

Related News

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Big Stories

×