E-Paper
Advertisement

Budh Gochar in Mithun: మిధునంలోకి బుధుడు.. మరో 72 గంటల్లో అద్భుతం.. ఆ రాశుల వారి ఇంట్లోకి డబ్బులే డబ్బులు..!

Budh Gochar in Mithun: మిధునంలోకి బుధుడు.. మరో 72 గంటల్లో అద్భుతం.. ఆ రాశుల వారి ఇంట్లోకి డబ్బులే డబ్బులు..!
Advertisement

Budh Gochar in Mithun on June 14th: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం దాని నిర్దిష్ట సమయంలో సంచరిస్తుంది. దీంతో అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే తాజాగా బుధుడు 12 రోజులు తర్వాత ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడు ప్రస్తుతం వృషభరాశిలో నుండి జూన్ 14వ తేదీన మిధునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏదైనా గ్రహం సంచరిస్తుందంటే, దాని వల్ల 12 రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయి. గ్రహాల సంచారం మానవ జీవితంపై ప్రభావం చూపుతుంది. జూన్ 14 న, బుధుడు తన సొంత రాశి అయిన మిథునంలోకి ప్రవేశించనుండడంతో 3 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

1. కన్యా రాశి

Advertisement

బుధుడు రాశిచక్రం మారడం వల్ల చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా ఉండబోతుంది. కన్యారాశిలోని పదవ ఇంటిని బుధుడు సందర్శించబోతున్నాడు. దీంతో ఈ రాశివారు ఉద్యోగం, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. ఈ కాలంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అంతేకాదు వ్యాపారం విస్తరించవచ్చు. ఈ రాశి వారికి తండ్రితో సంబంధాలు బలంగా ఉంటాయి.

2. తులా రాశి

Advertisement

బుధగ్రహ సంచారం తుల రాశి వారికి ఒక వరం కానుంది. తుల రాశిలోని తొమ్మిదవ ఇంట్లోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు పొందుతారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.

Also Read: Nirjala Ekadashi: కొద్దిరోజుల్లోనే ధనవంతులవ్వలనుందా..? అయితే,..

3. కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధ గ్రహ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభ రాశిలోని ఐదవ ఇంట్లో బుధుడు ప్రవేశించనున్నాడు. దీంతో వీరు అన్ని శుభవార్తలే వినే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు సంతానం కోరుకునే దంపతులకు సంతానం కలుగుతుంది. కుటుంబ విషయాలలో సంతోషం ఉంటుంది. అదే సమయంలో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రేమలో ఉన్నట్లయితే ప్రేమ వివాహం జరగవచ్చు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×