Big Stories

Nirjala Ekadashi 2024: జూన్ 18న నిర్జల ఏకాదశి.. కొద్దిరోజుల్లోనే ధనవంతులవ్వలనుందా..? అయితే..!

Nirjala Ekadashi Remedies: ఏకాదశి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఈ పవిత్ర దినాన పలు నియమాలు పాటిస్తూ పూజలు చేస్తారు. అలా చేయడం వల్ల తమ కష్టాలు తొలగిపోతాయంటూ భక్తులు నమ్మాతారు. ఈ నెల 18న నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించనున్నారు. అయితే, ఏకాదశి రోజున ఉపవాసం ఉండే భక్తులు పలు నియమాలు పాటించాలని.. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న మొక్కలు నెరవేరుతుయని.. అందులో ముఖ్యంగా ఆర్థిక సమస్యలకు సంబంధించి, వివాహానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అయితే నియమాలు పాటించని యెడల వారికి ఉపవాస పూర్తి పుణ్యం దక్కదని పేర్కొంటున్నారు.

- Advertisement -

ఏకాదశి రోజున విష్ణువును పూజిస్తుంటారు. పూజలో భాగంగా ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఉండడం వల్ల కీర్తి, ఆనందం మరియు శ్రేయస్సు.. మరణానంతరం మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు.. వ్రతం పాటించే వ్యక్తులు ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందుతారని భక్తుల నమ్మకం.

- Advertisement -

నిర్జల ఏకాదశి రోజున పలు నియమాలు పాటించాలని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఆరోజు ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసి ధ్యానం చేయాలని,  ఆ తరువాత ఆచారాల ప్రకారం లక్ష్మీ నారాయణ్ స్వామిని పూజించాలని చెబుతున్నారు. అదేవిధంగా లక్ష్మీదేవీకి కొబ్బరికాయను సమర్పించాలని చెబుతున్నారు. ఈవిధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, జీవితంలోని అన్ని దు:ఖాలు దూరమవుతాయంటా.

Also Read: Astrology: నేటి రాశి ఫలాలు.. వీరికి ధన లాభ యోగం!

డబ్బు సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారు నిర్జల ఏకాదశి రోజున విష్ణువుకు తలసీ ఆకులను సమర్పించాలని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల విష్ణువు ఆశీర్వాదం లభిస్తుందంటా. అయితే, ఈరోజు మాత్రం తులసి లేదా తులసి మంజ్రీని పొరపాటున కూడా విరిగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.

అంతేకాదు.. కోరుకున్న వరుడిని పొందాలనుకుంటే కూడా, నిర్జల ఏకాదశి రోజున పూజ సమయంలో విష్ణువుకు తులసి దళాన్ని సమర్పించాలని,  ఈ సమయంలో ఆదాయం పెరుగుదల మరియు అదృష్టం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించాలని చెబుతున్నారు.

Also Read: ఆదివారం రోజు ఈ చిన్న పని చేయండి.. మీ కోరికలు నెరవేరుతాయి..!

విష్ణువు మరియు లక్ష్మీదేవికి అన్నం ఖీర్ అంటే చాలా ఇష్టమని,  అందువల్ల పూజా సమయంలో విష్ణువుకి పగలని బియ్యం మరియు బెల్లం కలిపిన ఖీర్ ను నైవేద్యంగా ఉంచండని.. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి, విష్ణువు చాలా సంతోషిస్తారని.. వారి ఆశీస్సులు మీపై ఉంటాయంటూ వారు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆదారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News