E-Paper
Advertisement

Naseem Shah Emotional: గ్రౌండ్ లో ఏడ్చిన పాక్ ఆటగాడు.. ఓదార్చిన రోహిత్ శర్మ

Naseem Shah Emotional: గ్రౌండ్ లో ఏడ్చిన పాక్ ఆటగాడు.. ఓదార్చిన రోహిత్ శర్మ
Advertisement

Naseem Shah Crying after IND-PAK Match: టీ 20 ప్రపంచకప్ లో ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి అనంతరం…ఆ ఆటగాడు నసీమ్ షా గ్రౌండులో కుప్పకూలిపోయాడు. భావోద్వేగాన్ని తట్టుకోలేక కంటతడి పెట్టాడు.

దీనిని గమనించిన కెప్టెన్ రోహిత్ శర్మ అతని వద్దకు వెళ్లి ఓదార్చాడు. ఆటలో ప్రత్యర్థులమే గానీ, మనుషులుగా ఒక్కటేనని చాటి చెప్పాడు. అలాగే భారతీయులు స్నేహం కోసం, దేశం కోసం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారనే క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పాడు. ప్రస్తుతం ఆ ఓదార్పు వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

విషయం ఏమిటంటే… 120 పరుగుల స్వల్ప లక్ష్యంతో పాకిస్థాన్‌ బరిలోకి దిగింది. అనూహ్యంగా బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిపోయారు. ఇక ఆఖరి ఓవర్‌ వచ్చింది. 6 పరుగులకు 18 పరుగులు చేయాలి. అర్ష్‌దీప్ సింగ్ బంతిని అందుకున్నాడు.

Also Read: ఒక ప్రణాళిక లేకుండా వచ్చాం : పాక్ కెప్టెన్ బాబర్ అజామ్

Advertisement

ఇటువైపు క్రీజులో ఇమాద్ వసీం, నసీం షా ఉన్నారు. ఇద్దరూ మంచి హిట్టర్స్ కావడంతో, ఎప్పుడేం జరుగుతుందోనని అంతా నరాలు తెగే ఉత్కంఠతో చూస్తున్నారు. కానీ తొలి బంతికే ఇమాద్ వసీం కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. తర్వాత గ్రౌండ్ లోకి షహీన్ ఆఫ్రిది వచ్చాడు. తను కూడా మంచి ఆటగాడే. ధనాధన్ సిక్సర్లు కొడతాడు. అందుకే అందరిలో బాల్ బాల్ కి ఉత్కంఠ పెరిగిపోతోంది.

ఈ సమయంలో నసీం షా వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ లక్ష్యం పెద్దగా ఉండటంతో ఆఖరి బంతికి 8 పరుగులు చేయాల్సి వచ్చింది. దాంతో లాస్ట్ బాల్ కి సిక్స్ కొడదామని ట్రై చేసి 2 పరుగులే చేశాడు. దీంతో అక్కడికక్కడే గ్రౌండులో కుప్పకూలిపోయాడు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ వెళ్లి ఓదార్చాడు. జీవితంలో ఇలాంటివెన్నో చూడాలి. ఇది కూడా ఆటలో ఒక భాగమేనని సర్ది చెప్పి వెళ్లిపోయాడు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×