BigTV English
Advertisement

August Horoscope: ఆగస్ట్ నెలలో ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు

August Horoscope: ఆగస్ట్ నెలలో ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు

August Horoscope 2024: గ్రహాల సంచారం పరంగా ఆగస్టు నెల చాలా ముఖ్యమైంది. అనేక పెద్ద గ్రహాలు ఆగస్టు నెలలో తమ రాశులను మార్చుకుంటూ శుభ, అశుభ యోగాలను కలిగిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన యోగాలు సూర్యుడు, శని కలిసి ఒక శుభ యోగం, మరొక అశుభ యోగాన్నిస్తున్నారు. ప్రస్తుతం సూర్యుడు, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు, శని కర్కాటక రాశి ఆరు, ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని వల్ల అశుభకరమైన షడష్టక యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ఆగస్టు 15 వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది చాలా ప్రమాదకరమైన యోగం.


సూర్యుడు ఆగస్టు 16 నుంచి సింహ రాశిలో సంచరిస్తున్నాడు. ఏడవ ఇంట్లో సూర్యుడు, శని ముఖాముఖిగా ఉంటారు. ఈ సమయంలో అశుభ కరమైన సంసప్తక యోగం ఏర్పడనుంది. వీటితో పాటు ఆగస్టులో గ్రహాల సంచార ప్రభావం కూడా ఉంటుంది. ఆగష్టు 5 నుంచి బుధుడు సింహరాశిలో తిరోగమన దిశలో సంచరించనున్నాడు. ఆగష్టు 26న కుజుడు తన రాశిలో సంచరిస్తాడు. ఆగస్టు 28 న కర్కాటక రాశిలో బుధుడు ప్రత్యక్షంగా ఉంటాడు . ఆగస్టు 24 న శుక్రుడు, కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఆగస్ట్ నెలలో కొన్ని రాశులపై గ్రహాల గమనం అశుభ ప్రభావాలను చూపిస్తుంది. ఆగస్ట్ నెలలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేషరాశి:
మేషరాశి వారికి ఆగస్టు నెల చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ నెల మీరు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చులు నియంత్రణలో కూడా జాగ్రతగా ఉండాలి.
కన్యా రాశి:
కన్యా రాశివారికి ఆగస్టు మాసం ఒడుదుడుకులతో కూడి ఉంటుంది. మితిమీరిన ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. సహోద్యోగులకు కార్యాలయంలో చిక్కులు ఏర్పడతాయి ఈ నెలలో రుణాలు ఇవ్వడం మానుకోవడం మంచిది. లేకపోతే మనకొచ్చే డబ్బు నిలిచిపోతుంది.
మకర రాశి:
మకరరాశి వారికి ఆగస్టు నెల విశేష ఫలితాలను ఇవ్వదు. నెలరోజుల పాటు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలను బాగా ఎదుర్కొంటారు. కార్యాలయంలో పనిభారం కూడా ఉంటుంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది . వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి.
మీన రాశి:
మీనరాశి వారు ఆగస్టులో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. మీకు కార్యాలయంలో రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. పనుల్లో నిరాశ ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి


Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×