E-Paper
Advertisement

Viral Video: దారుణం.. బ్రతికుండగానే సజీవంగా పూడ్చిపెట్టిన వీడియో వైరల్

Viral Video: దారుణం.. బ్రతికుండగానే సజీవంగా పూడ్చిపెట్టిన వీడియో వైరల్
Advertisement

Viral Video: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఏకంగా బ్రతికున్న ఇద్దరు మహిళలనే సజీవంగా పూడ్చిపెట్టాలని ప్రయత్నించారు. రహదాని నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారని అందుకే ఈ దారుణానికి యత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో గల మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. అయితే రోడ్డు నిర్మాణానికి మమతా పాండే, ఆశా పాండే అనే ఇద్దరు మహిళలు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీంతో వారిద్దరిని కంకరతో సజీవంగా పూడ్చిపెట్టాలని ప్రయత్నించారు.

దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కంకర లోడ్‌తో ఇద్దరు మహిళలను సజీవంగా పూడ్చిపెట్టాలని ప్రయత్నించారు. ఈ తరుణంలో వారిని సగం వరకు పూడ్చిపెట్టగా, స్థానికులు వచ్చి ఆపేందుకు ప్రయత్నరించారు. వెంటనే వారిని రక్షించి చికిత్స కోసం సమీపంలో ఉండే ఆసుపత్రికి తరలించారు. దీంతో వారి ప్రాణాలు కాపాడగలిగారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

ఇద్దరు మహిళలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని పోలీసులు వెల్లడించారు. డంపర్ ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పజెప్పినట్లు తెలిపారు. అయితే ఇందులో నిందుతులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో స్ధానికంగా దుమారం రేపుతోంది.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×