BigTV English

Bathukamma: నాలుగో రోజు బతుకమ్మ.. ఏ నైవేద్యం సమర్పిస్తారు ?

Bathukamma: నాలుగో రోజు బతుకమ్మ.. ఏ నైవేద్యం సమర్పిస్తారు ?

Bathukamma: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. చిన్నా పెద్దా లేకుండా మహిళలు, చిన్నారులు సంబంరాలు చేసుకుంటున్నారు. పల్లెలన్నీ బతుకమ్మ పండగ సందర్భంగా కోలాహాలంగా మారాయి. అంతా ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు.


9 రోజులు జరుపుకునే ఈ పండగలో భాగంగా ఇప్పటికే మూడు రోజుల బతుకమ్మ పండగ సంబరాలు ముగిసాయి. రేపు అంటే అక్టోబర్ 5న నాల్గవ రోజు బతుకమ్మ పండగను జరుపుకోనున్నారు. నాల్గవ రోజు బతుకమ్మను నాన బియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు నానబియ్యం, బెల్లం, పాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

పూలపండగ బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు నాన పోసిన బియ్యాన్ని గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. కాబట్టి ఈ రోజును నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, తదితర పువ్వులతో పేర్చుతారు.


ముఖ్యంగా బతుకమ్మ పండగ సమయంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మనకు అడుగడుగునా కనిపిస్తాయి. బతుకమ్మ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సంబరంగా జరుపుకుంటారు. తీరొక్క పూవ్వులతో పూర్చిన బతుకమ్మ చుట్టూ చేరి చుట్టూ చప్పట్లు కొడుతూ ఆడతారు. ఆ తర్వాత నిమర్జనం చేస్తారు. మూడవ రోజు అటుకుల బతుకమ్మ ముగిసింది కాబట్టి అంతా మరుసటి రోజు జరిగే నానబియ్యంబతుకమ్మ పేర్చేందుకు సిద్దం అవుతారు.

Also Read: రెండు రోజుల పాటు అమావాస్య.. దీపావళి పండుగ ఎప్పుడు ?

తొమ్మిది రోజుల పండగ..
తొమ్మిది రోజుల బతుకమ్మ పండగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని చెబుతారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారిండ్ల నుంచి కన్నవారి ఇంటికి చేరుకుని పూల పండగను జరుపుకుంటారు.

ఈ తొమ్మిది రోజులు వీరంతా బతుకమ్మలు చేసి .. ప్రతీ సాయంత్రం బతుకమ్మ ఆటలు ఆడి తరువాత దగ్గరలో ఉన్న చెరువులో లేదా కాలువలో నిమర్జనం చేస్తారు. ఈ పూల పండగ తెలంగాణ మహిళలకు ప్రత్యేకమైన పండగ. త్రికోణంలో బతుకమ్మను పేర్చుతారు. తంగేడు, గునుగుతో పాటు వివిధ రకాలు పువ్వులతో బతుకమ్మను పేర్చుతారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×