BigTV English

Medigadda Repair Works: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం ఎవరిది? నిర్మాణ సంస్థ మౌనానికి కారణం ఏంటి?

Medigadda Repair Works: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం ఎవరిది? నిర్మాణ సంస్థ మౌనానికి కారణం ఏంటి?

ఇక్కడో చిన్న తిరకాసు ఉంది.. ఇప్పుడు దానిపైనే ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. అదేంటంటే.. మేడిగడ్డ బారాజ్‌ నిర్మాణం పూర్తైందని చెప్పి ఓ సర్టిఫికేట్‌ ఇప్పటికే ఇచ్చేశారు. 2019 జూన్‌ 21న కేసీఆర్‌ మేడిగడ్డ బారాజ్‌ను ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టు 6న ఎల్ అండ్ టీ-పీఈఎస్‌కు ప్రాజెక్ట్ పూర్తైనట్టు సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇప్పుడీ సర్టిఫికేట్‌ను చూపించి.. తమ పని నిర్మించడం వరకే రిపేర్లు చేయాలంటే మళ్లీ నిధులు కేటాయించాల్సిందే అని వాదిస్తున్నాయి కాంట్రాక్ట్ సంస్థలు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఈ సర్టిఫికేట్‌పై ఫోకస్ చేసింది.

వెంటనే పని పూర్తి అయ్యినట్టు ఇచ్చిన సర్టిఫికేట్‌ను వెనక్కి ఇచ్చేయాలని కోరుతుంది. లేదంటే ఆ సర్టిఫికేట్‌ను రద్దు చేసేందుకు రెడీ అవుతుంది. దీని కోసం లీగల్ బ్యాటిల్‌ చేసేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఎల్ అండ్‌ టీకి ఓ నోటీసులు అందించింది ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్.. చెప్పాలంటే ముందు పద్ధతిగానే అడిగారు కానీ ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం లేదు. అందుకే నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. అయితే మేడిగడ్డ బారాజ్‌కు సంబంధించి స్టిల్ 150 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని తేలింది. మరి ఈ పనులు ఎవరు చేస్తారనేది అసలు క్వశ్చన్.. అసలు పనులు అలానే ఉన్నాయి. రిపేర్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనంతటికి కారణం ఆ కంప్లీషన్‌ సర్టిఫికేట్.


Also Read: కేసీఆర్‌ను కేటీఆర్ చంపేశారేమో?

అయితే లీగల్ ఫైట్‌కు ముందు అసలు ఆ సంస్థ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందని వెయిట్ చేస్తున్నారు.  అసలు పనులు పూర్తి కాకముందే సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారనేదానిపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన విజిలెన్స్ విచారణ జరగుతుంది. నిజానికి  ఈ సర్టిఫికేట్ ఇచ్చేముందు చాలా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. బారాజ్‌ పనులు సంతృప్తి కరంగా జరిగాయి. అన్ని టెస్ట్‌ల్లో బరాజ్‌ పాసయ్యింది. మెయింటనెన్స్ టైమ్‌లో ఏమైనా సమస్యలు వస్తే తిరిగి నిర్మిస్తాం.. ఇలా అన్ని విషయాలకు సంబంధించి అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. నిర్మాణ సంస్థ ఎలాంటి అండర్ టేకింగ్ ఇవ్వకుండానే సర్టిఫికేట్ ఇచ్చేశారు. అదే ఎందుకు అనే దానిపైనే విచారణ జరుగుతోంది.

నిజానిక మేడిగడ్డ కుంగకముందే చాలా సమస్యలు వచ్చాయని విచారణలో తేలింది. 2019 నవంబర్‌ నుంచి బరాజ్‌ దిగువన డ్యామేజెస్‌ గుర్తించారు. ఆ రిపేర్లు ఏమీ చేయకుండానే సర్టిఫికేట్ ఇచ్చేశారు. అన్ని తెలిసే అప్పటి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఇప్పటికే విచారణలో తేలింది. దీని వల్ల ఇప్పుడు ప్రభుత్వ ఖాజానాకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి.. ఖాజానకు నష్టం వాటిల్లకుండా మేడిగడ్డను తిరిగి పనిలోకి తీసుకురావాలన్నది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన. అందుకే ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి పెంచుతోంది ప్రభుత్వం. అందుకే లీగల్ బ్యాటిల్‌కు కూడా రెడీ అయ్యింది.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×