E-Paper
Advertisement

Navpancham yog:నవ పంచమ యోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు

Navpancham yog:నవ పంచమ యోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు
Advertisement

Navpancham yog: నిర్ధిష్ట సమయం తర్వాత గ్రహాలు రాశులను మర్చుకుంటాయి. గ్రహాల రాశి మార్పు 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో అక్టోబర్ 17వ తేదీ ఉదయం 7.27 గంటలకు గ్రహాల రాజు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించాడు. అదే సమయంలో, కర్మను ఇచ్చే శనిదేవుడు ఇప్పటికే తులారాశిలో ఐదవ ఇంట్లో ఉన్నాడు.

శని, సూర్యుడు కలిసి తులారాశిలో నవపంచం రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వీటిలో, సూర్యుడు, శని కలయికతో ఏర్పడిన నవపంచమ రాజయోగం వల్ల 3 రాశుల వారు అధిక ప్రయోజనాలు పొందుతారు. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేష రాశి:

నవపంచమ యోగం వల్ల మేష రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు వారి కెరీర్‌లో పురోగతి సాధించడానికి కొత్త అవకాశాలను పొందుతారు. మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. వ్యాపారంలో విస్తరణకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు జరుగుతాయి. వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. అంతే కాకుండా మీ పనులు ఈ సమయంలో విజయవంతం అవుతాయి. ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు.

Advertisement

వృషభ రాశి :
వృషభ రాశి ఉద్యోగస్తులకు నవపంచం రాజ్యయోగ ప్రభావం వల్ల ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభిస్తుంది. ఇంతకుముందు కంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. డబ్బును పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చు. ఉద్యోగంలో సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా అనేక కార్యక్రమాల్లో విజయాలను అందుకుంటారు. కెరీర్ పరంగా శుభ వార్తలను అందుకుంటారు. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.

Also Read: దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగించాలి.. పాటించాల్సిన ఆచారాలు ఏమిటి ?

తులా రాశి:

నవపంచం రాజయోగం తులా రాశి వారి జీవితాల్లో సానుకూల ఫలితాలను తెస్తుంది. వీరికి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక సంక్షోభం సమసిపోయేలా కనిపిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా పాత వ్యాధి ముగిసి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. అంతే కాకుండా మీరు ఉన్నత స్థానంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×