Samyukta Menon: మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి పరిచయాలు అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఆ మూవీ భారీ హిట్ అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. బింబిసార, సార్, విరూపాక్ష లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.. ఇప్పటివరకు ఈ అమ్మడు చేసిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. ఈమె చేతిలో 8 సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్ మూవీ. ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఎవరు డైరెక్టర్? ఈ మూవీ టైటిల్ ఏంటి? వంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
గతంలో విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ చింతకాయల రవి సినిమాకు దర్శకత్వం వహించిన యోగి డైరెక్టర్ తో సంయుక్త మీనన్ కొత్త మూవీ చేయబోతుంది. కే ర్యాంప్ డైరెక్టర్ రాజేష్ దండా నిర్మిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా మొదలైంది.. ఈ సినిమా షూటింగ్ అయితే మొదలైంది కానీ టైటిల్ మాత్రం ఫిక్స్ చేయలేదు. గతంలో భైరవి, రాక్షసి వంటి టైటిల్స్ పేర్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ‘బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే టైటిల్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి కొద్ది రోజుల్లో అధికారక ప్రకటన వస్తుందని టాక్..
Also Read: మూవీ కోసం రాత్రంతా ప్రాక్టీస్… అలిసిపోయాను అంటున్న మమిత బైజు..
యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఒక్కసారిగా ఆమె క్రేజ్ కూడా పెరిగిపోయింది.. విరూపాక్ష సినిమా ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం సంయుక్త నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఆమె చేతిలో ఇప్పుడు 8 సినిమాలు ఉన్నాయి. బాలయ్యతో అఖండ 2, విజయ్ సేతుపతికి జంటగా పూరి జగన్నాథ్ సినిమా, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ శ్రీనివాస్‌కు జంటగా హైందవ, నిఖిల్‌కు జోడీగా స్వయంభు మూవీలో నటిస్తుంది. అలాగే తమిళంలో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది. కోలీవుడ్‌లో లారెన్స్‌తో బెంజ్, బాలీవుడ్ లో మహారాణి సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్ట్ లకు సైన్ చేసినట్లు టాక్. ఈ సినిమాలన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలు కావడంతో ఆమె అభిమానులు అన్ని హిట్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు.