BigTV English

Diwali 2024: దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగించాలి.. పాటించాల్సిన ఆచారాలు ఏమిటి ?

Diwali 2024: దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగించాలి.. పాటించాల్సిన ఆచారాలు ఏమిటి ?

Diwali 2024: హిందూ పండగలలో దీపావళి చాలా ముఖ్యమైన పండగ . ప్రతి ఏడాది ఈ పండగను ఆశ్వీయుజ మాస బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. కొంతమంది జ్యోతిష్య పండితులు దీపావళిని అక్టోబర్ 31 న జరుపుకోవాలని చెబుతుండగా, కొందరు దీనిని నవంబర్ 1 న జరుపుకోవాలని సూచిస్తున్నారు.


క్యాలెండర్‌లో అమావాస్య తేదీ  రెండు రోజుల రావడంతో 2 రోజులు దీపావళి జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాశీ పండితులు, జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం, దీపోత్సవం, లక్ష్మీ ఆరాధనకు అక్టోబరు 31న మంచి సమయం. ప్రభుత్వం సెలవుల క్యాలెండర్‌లో, దీపావళి తేదీని అక్టోబర్ 31గా పేర్కొనడం జరిగింది.

అక్టోబర్ 31న దీపావళి ఎందుకు జరుపుకోవాలి ?


హిందూ మత గ్రంథాలలో, దీపావళి పండుగను కార్తీక మాసంలోని అమావాస్య తిథి సాయంత్రం ,రాత్రి జరుపుకుంటారు. ఈ సంవత్సరం, కార్తీక మాసం అమావాస్య తేదీ అక్టోబర్ 31 సాయంత్రం నుండి ప్రారంభమై నవంబర్ 01 సాయంత్రం వరకు కొనసాగుతుంది. హిందూ మతంలో, దీపావళి నాడు అమావాస్య తిథి నాడు ప్రదోషకాలంలో, రాత్రిపూట లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. లక్ష్మీ దేవి పూజలను కూడా ఈ రోజు మహిళలు నిర్వహిస్తూ ఉంటారు. దీపావళి రోజు లక్ష్మీ దేవిని పూజిస్తే డబ్బుకు లోటు ఉండదని అంటారు.

పంచాంగం ప్రకారం, అమావాస్య తిథి అక్టోబర్ 31 న సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే నవంబర్ 01 సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఆపై ప్రతిపాద తిథి ప్రారంభమవుతుంది.

దీపావళిని కార్తీక అమావాస్య సమయంలో ప్రదోష కాల రాత్రి శుభ సమయంలో లక్ష్మిని పూజించడం, దీపాలు వెలిగించడం ద్వారా పండగను జరుపుకుంటారు. అందుకే దీపాల పండుగ అయిన దీపావళిని అక్టోబర్ 31న జరుపుకోవాలని కొందరు పండితుల అభిప్రాయం. ఇదిలా ఉంటే దీపాల  వరుసలను దీపావళి అని పిలుస్తారు. అయితే ఈ పండగ రోజు దీపాలను ఏ నూనెతో వెలిగించాలనే సందేహం చాలా మందికి ఉంటుంది.

Also Read: దీపావళి నాడు ఈ పరిహారాలు పాటిస్తే అదృష్టాన్ని పొందుతారు

దీపావళి రోజు ఏ నూనెతో దీపాలను వెలిగించాలి ?

దీపావళి రోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. దీపావళి రోజు నువ్వుల నూనెతో దీపాలు ఏ ఇంట్లో అయితే వెలిగిస్తారో ఈ ఇంట్లోకి లక్ష్మీ దేవి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా దీపావళి రోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. పండగ రోజు సాయంత్రం సమయంలో  కొత్త బట్టలు ధరించి లక్ష్మీ దేవిని పూజించి పూజా గదితో పాటు తులసి కోట ముందు మహిళలు దీపాలు వెలిగిస్తే ఆయురారోగ్యాలతో పాటు ఐష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. అంతే కాకుండా ఇంట్లోకి లక్ష్మీ దేవి ప్రవేశిస్తుందని అంటారు. దీపావళి రోజు దీపాలను వెలిగించడానికి నేరుగా అగ్గిపుల్లను వెలిగించకూడదు. మొదట ఒక అగరువత్తిని వెలిగించే దానితో అన్ని దీపాలను వెలిగించాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×