Niharika -Viswak: మెగా డాటర్ నిహారిక కొణిదల నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ తో ట్రెండ్ అవుతుందన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు తన విడాకుల గురించి హాట్ టాపిక్ గా మారిన నిహారిక ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది పాత వీడియోనే అయినా కానీ ఇప్పుడు ట్రెండ్ అవ్వడంతో మరోసారి ఈమె వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? ఇప్పుడెందుకు అది ట్రెండ్ అవుతుంది అన్న విషయం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల రొమాంటిక్ సీన్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇది ఒక పాత వీడియో.. కానీ వీరిద్దరూ కలిసి ఇలా కనిపించడంతో మరోసారి ఇది ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో విశ్వక్ ఒక గోడ దగ్గర నిలబడి కనిపిస్తాడు. నిహారిక అతనితో ఏదో కావాలని అడుగుతూ కనిపిస్తుంది. విశ్వక్ సిగ్గుపడుతూ వద్దు అంటూ తలదించుకుంటాడు. నిహారిక మాత్రం అతన్ని రెచ్చగొడుతూ కనిపిస్తుంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇద్దరు కలిసి సినిమా తీశారా? ఏదైనా వెబ్ సిరీస్ చేశారా? వీరిద్దరికీ ముందే పరిచయం ఉందా? ఇద్దరు కలిసి చదువుకున్నారా ఇలాంటి విషయాలపై జనాలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వీడియో గురించి వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గాని అసలు విషయం తెలియదు.
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను చేస్తూ బిజీగా మారాడు. ఈ హీరో చివరగా లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. ఫంకీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నాడు విశ్వక్. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ సినిమాపై మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. మరి మూవీ ఎలాంటి టాక్ ని అందుకుంటుందో చూడాలి..
Also Read: DSP హీరోగా బలగం వేణు కొత్త సినిమా.. మరి ఎల్లమ్మ పరిస్థితి?
తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంది. ఒకవైపు వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తుంది. ఈమె నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమె నటిగా సత్తాని చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఫోటోలు బాగా ట్రెండ్ అవుతుంటాయి..
?igsh=Y3BvYXUzNHhpdHdq