Karthika masam 2024: పవిత్రమైన కార్తీకమాసంలో ఈ పనులు మీరు చేస్తున్నారా.. ఇలాంటి ఆలోచనలు మీ మెదడులోకి వస్తున్నాయా.. అయితే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు వేదపండితులు. ఇంతకు అవేమిటో తెలుసుకుందాం.
కార్తీకమాసం ఇదొక పుణ్యాలు అందించే మాసం. భగవంతునికి భక్తునికి అనుసంధానం కలిగించే పవిత్రమాసం. ఈ మాసం వచ్చిందంటే చాలు.. ప్రతి భక్తుని మనసు భక్తితన్మయత్వంతో ఉండాల్సిందే. ఓం నమః శివాయ అనే ఒక్క నామం ఈ మాసంలో జపిస్తే కలిగే పుణ్యఫలం అంతా ఇంతా కాదు. ఈ మాసంలో పరమేశ్వరునికి పూజలు నిర్వహిస్తే, లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఆ ఇంట సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
నిశ్చలమైన భక్తితో శివయ్యా అంటే చాలు భక్తుల కొంగుబంగారమే ఈ మాసంలో. అంతేకాదు కార్తీకమాసంలో కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి లకు ఉన్న ప్రత్యేకతలు అన్నీ, ఇన్నీ కావు. అందుకే కార్తీకమాసంలో ఏ శైవక్షేత్రం చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ మాసంలో ఆలయానికి వెళ్లి ఒక్క దీపం వెలిగించినా, కలిగే భాగ్యం కూడా వర్ణించలేము. అలాగే అయ్యప్ప, శివయ్యల మాలధారణను భక్తులు అధిక సంఖ్యలో స్వీకరిస్తారు. మాలాధారణలో ఎన్నో కఠిన నియమాలను అనుసరించి తమ భక్తిని చాటుకుంటారు.
Also Read: Shadashtak Yog: అరుదైన షడష్టక యోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ డేస్
కాగా ఈ మాసంలో మాత్రం భక్తులు పలు పనులు మాత్రం చేయవద్దని వేదపండితులు సూచిస్తున్నారు. అవేమిటంటే.. లైంగిక వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలన్నారు. అలాగే కార్తీకమాసంలో పాపపు ఆలోచనలు, ఒకరికి ద్రోహం చేయాలన్న ఆలోచనలు మన మెదడులోకి చొరబడకుండా చూడాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ దైవదూషణ మహా పాపమని, దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదని వేదపండితులు తెలుపుతున్నారు.
ఈ పనులు చేయకుండ.. పవిత్రమైన కార్తీకమాసంలో శివయ్య నామాన్ని నిరంతరం జపించాలని, మాలధారణ పాటించే భక్తులు ఎక్కువగా ఆలయాలలో ఉండడంతో అన్నీ శుభాలు చేకూరుతాయన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో వేదపండితులు సూచించిన పనులు మాత్రం చేయవద్దు.. శివయ్య నామాన్ని జపిస్తూ.. కార్తీక మాసం పుణ్యఫలాలు అందుకోవాలని ఆ శివయ్యను కోరుకుందాం.