BigTV English

AR Rahman: అందుకే విడాకులు తీసుకున్నాను, తన తప్పేం లేదు.. క్లారిటీ ఇచ్చిన సైరా బాను

AR Rahman: అందుకే విడాకులు తీసుకున్నాను, తన తప్పేం లేదు.. క్లారిటీ ఇచ్చిన సైరా బాను

AR Rahman: సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా ఉండిపోతుంది. అలాంటిది ఎన్నో ఏళ్లు కలిసున్న సెలబ్రిటీలు సడెన్‌గా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే దానిపై ఎన్నో రోజులు చర్చలు సాగుతూనే ఉంటాయి. తాజాగా ఆస్కార్ విజేత, వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ (AR Rahman), తన భార్య సైరా బాను (Saira Banu) విడిపోతున్నట్టుగా, విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అప్పటినుండి అసలు వీరు ఎందుకు విడిపోతున్నారని ఎన్నో వార్తలు వస్తుండగా ఫైనల్‌గా దీనిపై సైరా బాను స్పందించక తప్పలేదు. విడాకులకు కారణాన్ని చెప్తూ ఆమె ఒక వాయిస్ నోట్ విడుదల చేశారు.


అందరికీ క్లారిటీ

ఎఆర్ రెహమాన్‌తో పాటు ఎన్నో ఏళ్లుగా తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మోహిని డే కూడా తన భర్తతో విడాకులు ప్రకటించడంతో రెహమాన్ రెండో పెళ్లికి సిద్ధమంటూ వార్తలు వచ్చాయి. విడాకుల విషయంలో ఆయనదే తప్పంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. దీనిపై రెహమాన్ ప్రత్యక్షంగా స్పందించలేదు. కానీ ఈ తప్పుడు ప్రచారాలు ఆపకపోతే అందరిపై పరువునష్టం దావా వేస్తామని తన తరపున లాయర్ సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో ఈ ప్రచారాలు కాస్త తగ్గాయి. ఇంతలోనే తన మాజీ భర్త అయిన రెహమాన్‌ను అందరూ నానా మాటలు అంటుండంతో ఆయన అలాంటి వారు కాదని చెప్పడానికి సైరా బాను ముందుకొచ్చారు.


Also Read: నాగచైతన్య కోసం అనవసరమైన ఖర్చులు పెట్టాను, అవన్నీ యూజ్‌లెస్.. సమంత కామెంట్స్

ప్లీస్ ఆపేయండి

‘‘విడాకుల విషయంలో అనవసరంగా రెహమాన్‌పై బురద చల్లకండి. ఆయన చాలా మంచివారు. ప్రపంచంలో అత్యంత మంచి మనిషి. నేను ప్రస్తుతం ముంబాయ్‌లో ఉంటున్నాను. గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం అస్సలు బాలేదు. అందుకే నేను రెహమాన్ నుండి బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాను. యూట్యూబ్‌కు, యూట్యూబర్లకు, తమిళ మీడియాకు ఇదే నా రిక్వెస్ట్. రెహమాన్ గురించి తప్పుగా మాట్లాడకండి ప్లీజ్’’ అంటూ అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నారు సైరా బాను. గత కొన్ని నెలలుగా సైరా బాను.. రెహమాన్‌తో కలిసి ఉండడం లేదు. రెహమాన్ చెన్నైలో ఉంటుండగా సైరా బాను మాత్రం ముంబాయ్‌లో ఉంటున్నారు. ఈ విషయంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు.

ఇబ్బంది పెట్టలేను

‘‘నేను కొన్నాళ్లుగా ముంబాయ్‌లో ఉంటున్న మాట నిజమే. అది కూడా నా ట్రీట్మెంట్ కోసమే. నేను చెన్నైలో లేకపోతే సైరా ఏమయిపోయింది అని అందరూ అనుకుంటారని తెలుసు. అందుకే నేను ముంబాయ్‌లో ఉంటున్నానని క్లారిటీ ఇస్తున్నాను. అక్కడే ఉంటే నా ట్రీట్మెంట్‌కు చాలా ఇబ్బంది అయ్యేది. అలా అని రెహమాన్ బిజీ షెడ్యూల్‌ను నేను డిస్టర్బ్ చేయాలని అనుకోవడం లేదు. నా పిల్లలను కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. అందుకే రెహమాన్‌ను ఎవరూ ఏమీ అనకండి. ఆయనను వదిలేయండి. నేను ఆయనను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఆయనను ఎంత ప్రేమిస్తున్నానో, ఆయన కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నారు’’ అంటూ అన్ని తప్పుడు వార్తలకు చెక్ పెట్టే సమాధానమిచ్చారు సైరా బాను.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×