BigTV English

Saturn lunar eclipse: జులై 24న 18 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. ఎందుకో తెలుసా ?

Saturn lunar eclipse: జులై 24న 18 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. ఎందుకో తెలుసా ?

Saturn Lunar Eclipse: శని గ్రహం 18 సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం చేయబోతోంది. మనం ఎక్కువగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. శని గ్రహం ఆకాశంలో కనువిందు చేయబోతోంది. దీనిని మనం నేరుగా కూడా చూడవచ్చు. 18 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఖగోళ దృశ్యం భారత్‌లో కనిపించనుంది. ఈ దృశ్యం జులై 24, 25 అర్ధరాత్రి కనిపిస్తుంది. ఈ సమయంలో శని చంద్రుడిని వెనక దాక్కుంటుంది.


శని వలయాలు చంద్రుడి వైపు నుంచి కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దీనిని అధ్యయనం చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనినే శని చంద్ర గ్రహం అని కూడా పిలుస్తారు. మనం కళ్లతో కూడా నేరుగా దీన్ని చూడవచ్చు.
ఎప్పుడు జరుగుతుంది..
జులై 24 మధ్యాహ్నం 1:00 గంటల తర్వాత ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1:40 గంటలకు చంద్రుడు శని గ్రహాన్ని పూర్తిగా తన వెనక దాచుకుంటాడు . మధ్యాహ్నం 2:25 గంటలకు శని గ్రహం చంద్రుడి వెనక నుంచి ఉద్భవించడం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని గంటల పాటు శని యొక్క ఈ అద్భుత దృశ్యం మనకు కనువిందు చేస్తుంది.
భారత్‌తోపాటు ఎక్కడ చూడవచ్చు..

ఈ అద్భుతమైన దృశ్యం భారత్‌లో కనిపిస్తుంది. భారత్‌తో పాటు శ్రీలంక, మయన్మార్, చైనా, జపాన్‌లలో కూడా ఈ దృశ్యాన్ని వేర్వేరు సమయాల్లో చూడవచ్చు. శని చంద్రగ్రహణం అని దీనికి పేరు కూడా పెట్టారు. రెండు గ్రహాలు తమ వేగంతో కదులుతున్నప్పుడు తన మార్గాన్ని మార్చుకున్నప్పుడు శని చంద్రుడి వెనుక నుంచి పైకి లేచినట్టుగా కనిపిస్తుంది. శని వలయాలు ముందుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఖగోళ దృగ్విషయాలపై ఆసక్తి ఉన్న వ్యక్తులు, పరిశోధకులు దీనిపై ఎంతో ఆసక్తితో ఎదరు చూస్తున్నారు.
మళ్లీ మూడు నెలల తర్వాత..
శని చంద్ర గ్రహణం ఈ సారి చూడటం మిస్ చేసుకున్నట్లయితే బాధపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మళ్లీ భారత్‌లో కనిపించి కనువిందు చేయబోతుంది. మేఘాల కారణంగా ఈ సారి కనిపించకపోతే తిరిగి అక్టోబర్ నెలలో మనం మళ్లీ చూడవచ్చు.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×