BigTV English

Anasuya: పవన్ తో ఐటెంసాంగ్ చేస్తున్నా.. మోత మోగిపోతుంది

Anasuya: పవన్ తో ఐటెంసాంగ్ చేస్తున్నా.. మోత మోగిపోతుంది

Anasuya latest news(Telugu cinema news): యాంకర్ అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ మానేసి సినిమాలపై దృష్టిపెట్టింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క టీవీ షోస్ కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాల్లో ఐటెంసాంగ్స్ కూడా చేసి మెప్పించింది. కానీ, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది లేదు. రెండు సార్లు అవకాశం వచ్చినా కూడా ఆమె సున్నితంగా తిరస్కరించిందని టాక్.


ఇంకా చెప్పాలంటే అత్తారింటికి దారేది సినిమాలో ఓరి దేవుడా సాంగ్ కు మొదట అనసూయను కూడా అడిగారట. కానీ, సింగిల్ గా పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే బావుంటుంది అని ఆ సాంగ్ ను తిరస్కరించిందట. ఆ తరువాత మరో ఆఫర్ వచ్చినా .. అప్పటికి డేట్స్ ఇష్యూ వలన కాదనుకున్నదంట. కానీ, ఈసారి మాత్రం అస్సలు వదిలేదేలే అని ఎట్టకేలకు పవన్ తో డ్యాన్స్ వేసే ఛాన్స్ ను పట్టేసింది. ఈ విషయాన్ని ఆమె ఒక షోలో అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఆమె కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫోటోను చూపించి ఎవరో కనుక్కోమని శ్రీముఖి అనగానే.. శేఖర్ మాస్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్తాడు. ఇక అప్పుడు అనసూయ ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది.


” టెలివిజన్ చరిత్రలోనే మొదటిసారి నేను ఎంతో గర్వంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పవన్ సార్ తో నేను ఒక బ్యూటీఫుల్ డ్యాన్స్ నెంబర్ చేశాను. మన టీవీ లో మోత మోగిపోద్ది ఆ పాట మాత్రం” అని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఏ సినిమాలో అనసూయ సాంగ్ ఉంటుంది అనే అనుమానాలు రావడం సహజం.

ఆ లెక్కన చూసుకుంటే.. ఇప్పటికే హరిహర వీరమల్లు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చింది. అందులో ఉండే ఛాన్స్ లేదు. OG సైతం సగానికి పైగా సినిమా పూర్తీ అయ్యింది. అది కూడా కష్టమే. ఇక మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ లోనే అమ్మడు అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ ను మొదలుపెట్టింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ తో అనసూయ ఐటెంసాంగ్ చేయడం అంటే మాటలు కాదు. ఇది కనుక హిట్ అయితే.. అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి అనసూయ లక్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×