BigTV English
Advertisement

Devara: ఎన్టీఆర్ డ్యాన్స్ అదిరిపోతోంది.. తోబా సాంగ్ కొరియోగ్రాఫర్ కామెంట్స్ వైరల్

Devara: ఎన్టీఆర్ డ్యాన్స్ అదిరిపోతోంది.. తోబా సాంగ్ కొరియోగ్రాఫర్ కామెంట్స్ వైరల్

Devara: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే.


రెండు పార్ట్స్ గా రిలీజ్ అవుతున్న దేవర మూవీ పార్ట్ 1.. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు కానీ, ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన టెక్నీషియన్స్ కానీ దేవర గురించి ఏ మాట చెప్పినా ఇట్టే వైరల్ గా మారిపోతుంది.

తాజాగా దేవర కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్.. ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. దేవరలో ఒక సాంగ్ కు నేను కొరియోగ్రఫీ చేశాను. అందులో పెద్ద పెద్ద స్టెప్స్ ఉండవు. చాలా సింపుల్ గా డిజైన్ చేశాను. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ డ్యాన్స్ చాలా స్వీట్ గా ఉంటుంది. అందరు బాగా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.


ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి స్టెప్పులు అయినా అవలీలగా వేసేస్తాడు. ఇక బాస్కో బాలీవుడ్ కొరియోగ్రాఫర్. ఈ మధ్య సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తోబా సాంగ్ కు కొరియోగ్రఫీ చేసింది బాస్కోనే. దీంతో ఈ సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ కానుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×