E-Paper
Advertisement

Perumal Statue Fell Down: అపచారం.. అపచారం.. గరుడ సేవలో అపశృతి.. వాలిపోయిన స్వామి విగ్రహం!

Perumal Statue Fell Down: అపచారం.. అపచారం.. గరుడ సేవలో అపశృతి.. వాలిపోయిన స్వామి విగ్రహం!
Advertisement

Perumal Statue Fell Down in Tamil Nadu: అపచారం.. స్వామికి ఏదో లోటు చేశారు.. అందువల్ల ఉన్నట్లుండి స్వామి విగ్రహం ఒరిగిపోయిందన్నది అక్కడికి వచ్చిన భక్తుల నుంచి బలంగా వినిపిస్తున్నమాట అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని తిరువొత్తియూర్ కల్యాణ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో గరుడ సేవ నిర్వహిస్తున్నారు. స్వామి పల్లకి మోసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అపశృతి తలెత్తకుండా పలుమార్లు పల్లకిని పరిశీలించారు నిర్వాహకులు. గరుడ సేవ అనేసరికి భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు.వచ్చిన వారిలో స్వామిని కళ్లారా చూద్దామనే అనుకునేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు.

Advertisement

అయితే ఏం జరిగిందో తెలీదుగానీ కల్యాణ వరదరాజ పెరుమాళ్ స్వామి పల్లకి ఓ వైపు పూర్తిగా ఒరిగిపోయింది. చివరకు చుట్టుపక్కల ఉన్న భక్తులు విగ్రహం వద్దకు వచ్చిన కిందపడిపోకుండా చూశారు. ఈ క్రమంలో కొందరు సిబ్బంది గాయపడ్డారు. అలాగే ప్రధాన అర్చకుడికి గాయాలయ్యాయి.

Also Read: ప్రతీ రోజూ స్నానం తర్వాత ఇలా చేస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు ఉంటాయి.

Advertisement

గరుడ వాహనాన్ని మోసే కర్రలు బలంగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. వాహనానికి కొత్త కర్రలు తీసుకురావాలని పలుమార్లు చెప్పినా తీసుకురాలేదని ఆలయ సిబ్బంది వైపు నుంచి బలంగా వినిపిస్తున్నమాట. దీని వెనుక ముమ్మాటికీ అధికారులదే నిర్లక్ష్యమేనని భక్తులు అంటున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ నిర్వాహకులు సైలెంట్ అయిపోయారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×