E-Paper
Advertisement

iPhone 15 at Rs 5,999: ఆగండి ఆగండి.. ఐఫోన్ 15 కొంటున్నారా..? ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని డిస్కౌంట్స్!

iPhone 15 at Rs 5,999: ఆగండి ఆగండి.. ఐఫోన్ 15 కొంటున్నారా..? ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని డిస్కౌంట్స్!
Advertisement

iPhone 15 at Rs 5,999 Only: యాపిల్ ఐఫోన్లకు మార్కెట్‌లో క్రేజ్ మామూలుగా లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ధర ఎంతైనా.. కొనేందుకు ఫోన్ ప్రియులు ఆలోచించడం లేదు. అప్పు చేసి మరీ కొనేస్తున్నారు. మరికొందరేమో ఈఎంఐ ఆప్షన్‌లలో కొనుక్కుంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఆఫర్లు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి యాప్‌లు ఐఫోన్లపై మంచి డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందిస్తాయేమో అని ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్ 15 పై అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. Apple గత సంవత్సరం సెప్టెంబర్ 2023లో iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీనిలో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను జోడించింది. తక్కువ బడ్జెట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇప్పుడు శుభవార్త వచ్చింది. ఐఫోన్ 15పై భారీ తగ్గింపులు ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Advertisement

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. ఈ డీల్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తక్కువ ధరకు ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ఫోన్ 128 జీబీ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.79,999గా ఉంది. అయితే ఇప్పుడు ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్ నేరుగా 9శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే ఎలాంటి అదనపు ఆఫర్ లేకుండా ఈ ఫోన్‌ను రూ.71,999కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: వర్త్ వర్మ వర్త్.. కేవలం రూ. 42,900 లకే ఐఫోన్ 15.. ఆఫర్ పోతే మళ్లీ రాదు వర్మ!

Advertisement

అంతేకాకుండా SBI క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు నేరుగా రూ.4,000 తగ్గింపు వర్తిస్తుంది. అలాగే ICIC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్స్‌పై రూ. 4,000 తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యూపిఐ ట్రాన్షక్షన్‌పై రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఏకంగా రూ.62000 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో దీన్ని కేవలం రూ.5,999లకే కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే పాత ఫోన్ మంచి కండీషన్ కలిగి ఉండాలి. ఎలాంటి హ్యాంగింగ్, డ్యామేజ్ ఉండకూడదు.

ఐఫోన్ 15 ఫీచర్లు

ఐఫోన్ 15ను అనేక ఫీచర్లతో కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 15 పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే 5 కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. iPhone 15లో A16 SoC చిప్‌ అమర్చబడింది. ఆపిల్ గత సంవత్సరం ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లలో A15 బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించింది. అయితే ప్రో మోడల్‌లు వేగవంతమైన, మెరుగైన A16 చిప్‌ను కలిగి ఉన్నాయి.

Related News

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×