BigTV English

Puri Rath Yatra 2024: జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం.. పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, సీఎం రేవంత్

Puri Rath Yatra 2024: జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం.. పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, సీఎం రేవంత్

Puri Jagannath Rath Yatra: విశ్వ ప్రసిద్ధమైన ఒడిశాలో పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం అయింది. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. దీంతో పూరీ పరిసర ప్రాంతాలు సైతం భక్తులతో కిక్కిరిసి పోయాయి. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణలతో అక్కడి విధులన్నీ మార్మోగుతున్నాయి.


రథయాత్ర సందర్భంగా ఆదివారం తెల్లవారు జాము 4 గంటలకు రత్నసింహాసనంపై చతుర్ధామూర్తులు కొలువు దీరారు. అనంతరం జగన్నాథుని నవయవ్వన రూపాలంకరణ జరిగింది. జగన్నాథ, సుభద్రలు శ్రీ క్షేత్రంలోని రత్న సింహాసనం వదిలి, రథంపై వెళ్లి, తమను పెంచిన తల్లి గుండిచా దేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జనహోష మధ్య రథాలపై 3 కిలో మీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధిని చేరుకుంటాయి.

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఆదివారం ముర్ము పూరీ జగన్నాథ్‌ను దర్శించుకున్నారు. రాష్ట్రపతికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ ఘన స్వాగతం పలికారు.


పూరీలో జగన్నాథుడి రథయాత్ర తొలి రోజు శోభాయమానంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తుల జయ జయధ్వానాల మధ్య రథయాత్ర వైభవంగా కొనసాగింది. 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున రత్నసింహ మూర్తులు కొలువుదీరారు. అనంతరం జగన్నాథుడిని అలంకరించారు. మంగళహారతి, మైలం, ఆకాశ తిలకధారణ, గోపాలవల్లభ సేవ, ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నేత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ చెరాపహారా చేశారు. సాయంత్రం 4 గంటలకు సారథులు అశ్వాలు అమర్చి తాళ్లు కట్టి 5 గంటలకు బల భద్రి తాళధ్వజ రథం లాగారు. ఆ తర్వాత సుభద్రాదేవి రథం, అనంతరం జగన్నాథుడి రథం గుండిచా ఆలయానికి బయలుదేరాయి. ఆదివారం సూర్యాస్తమయం కావడంతో యాత్ర ముగిసింది. మళ్లీ సోమవారం ఉదయం 9గంటలకు యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక రథయాత్రకు భారత ప్రధాని ద్రౌపతి ముర్ము హాజరైన విషయం తెలిసిందే. అయితే దేశ రాష్ట్రపతి రథయాత్రకు హాజరుకావడం ఇదే తొలిసారి. గతంలో ఏ రాష్ట్రపతి రథయాత్రకు ఇంతవరకు హాజరు కాలేదు. ఉత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి, ఒడిశా గవర్నర్ తో కలిసి సుభద్రాదేవి రథం లాగారు.

Also Read: శని తిరోగమనంతో కన్యా రాశి వారికి ఎన్నడూ ఎరుగని కష్టాలు !

సీఎం మోహన్ చరణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రథోత్సవంలో పాల్గొన్నారు. అయితే స్వామివారి నవయవ్వన దర్శనం నేత్రోత్సవం రథయాత్ర ఒకే రోజు రావడంతో రథయాత్రను మధ్యలోనే నిలిపివేశారు. సోమవారం మళ్లీ రథయాత్ర మొదలుకానుంది. రథయాత్ర సోమవారం గుండిచా ఆలయానికి చేరుకుంటుంది . కొన్ని కారణాలతో ఆలస్యమైతే రథయాత్ర మంగళవారం ఆలయానికి చేరుకుంటుంది. జగన్నాథుడు బలరాముడు, సుభద్ర రథాలు గుండిచా ఆలయంలోనే ఉంటాయి, అక్కడ అనేక రకాల వంటకాలు తయారు చేసి దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు, శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

 

తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా ఘనంగా జగన్నాథుని రథయాత్ర నిర్వహించారు. ఈ రథయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

 

 

Tags

Related News

Vinayaka Chavithi 2025: వినాయక చవితి స్పెషల్.. శంఖుల గణనాథుడు భక్తులను.. తెగ ఆకట్టుకుంటున్నాడు!

Mahabhagya Yoga 2025: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Vastu Tips: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇలా పూజిస్తే.. సంపద, శ్రేయస్సు !

Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్ గణేశుడి లీలలు తెలుసుకుందాం రండి!

Tirumala Special: ఏరువాడ పంచెల రహస్యం ఇదే.. శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోండి!

Big Stories

×