E-Paper
Advertisement

ప్రపంచ ప్రసిద్ధ.. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత

ప్రపంచ ప్రసిద్ధ.. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత

Jagannath Rath Yatra 2026: హిందూ సంప్రదాయంలో.. అత్యంత పవిత్రమైన, వైభవంగా జరిగే ఉత్సవాల్లో ఒడిశాలోని ‘పూరీ జగన్నాథ రథయాత్ర’ ఒకటి. ప్రతి ఏటా దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ అద్భుత ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు పూరీ క్షేత్రానికి తరలివస్తుంటారు. కలియుగ దైవమైన ఆ జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి రథాలెక్కి పురవీధుల్లో విహరించే ఆ క్షణం భక్తులకు పరమ పవిత్రం. మరి ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆ యాత్ర విశేషాలు, దాని వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జగన్నాథ రథయాత్ర 2026 తేదీ, ముహూర్తం:

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం విదియ తిథి రోజున ఈ రథయాత్ర ఘనంగా ప్రారంభమవుతుంది. ఈ ఏడాది 2026, జూలై 16 (గురువారం)న పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. జూలై 15వ తేదీ మధ్యాహ్నం 11:50 గంటలకే విదియ తిథి ప్రారంభమై.. జూలై 16 ఉదయం 08:52 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయ తిథి ప్రకారం జూలై 16న రథాలను లాగుతారు.

రథయాత్ర పూర్తి షెడ్యూల్ (9 రోజుల ఉత్సవం):
జూలై 16 (గురువారం): శ్రీ గుండిచా రథయాత్ర ప్రారంభం (రథాలను లాగడం).

జూలై 20(సోమవారం): హేరా పంచమి (లక్ష్మీదేవి రథాన్ని సందర్శించే రోజు).

జూలై 24(శుక్రవారం): బహుదా యాత్ర (జగన్నాథుడి తిరుగు ప్రయాణం).

జూలై 25(శనివారం): సునా బేష (బంగారు ఆభరణాలతో స్వామివారి అలంకరణ).

జూలై 27(సోమవారం): నీలాద్రి బిజే (స్వామివారు తిరిగి గుడిలోకి ప్రవేశించడం).

రథయాత్ర ప్రాముఖ్యత ఏంటి?
జగన్నాథుడి రథయాత్ర వెనక ఒక గొప్ప అంతరార్థం ఉంది. సాధారణంగా దేవుడిని చూడటానికి మనం గుడికి వెళ్తాం. కానీ, గుడికి రాలేని అశక్తులు, పేదలు, అన్ని వర్గాల ప్రజల కోసం ఆ భగవంతుడే స్వయంగా నడిచొచ్చి దర్శనమిచ్చే పండుగే ఈ రథయాత్ర. జగన్నాథుడు తన అన్నదమ్ములతో కలిసి గుండిచా దేవి (మేనత్త ఇల్లు) ఆలయానికి వెళ్తాడు. అక్కడ 7 రోజులు ఉండి, ఆ తర్వాత మళ్లీ తన సొంత ఆలయానికి తిరిగి వస్తాడు. ఈ యాత్రలో రథం తాడును ఒక్కసారి తాకినా లేదా లాగినా జన్మజన్మల పాపాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

5 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
పూరీ జగన్నాథ ఆలయం, ఈ రథయాత్ర చుట్టూ ఎన్నో సైన్స్ కూడా వివరించలేని మిస్టరీలు ఉన్నాయి. అవేంటో చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..

కొత్త రథాల నిర్మాణం: ప్రతి ఏటా ఈ మూడు రథాలను సరికొత్తగా, కేవలం వేప చెక్కలతో మాత్రమే తయారు చేస్తారు. ఇందులో ఒక్క ఇనుప మేకును కూడా వాడరు. అక్షయ తృతీయ రోజున ఈ రథాల నిర్మాణం మొదలవుతుంది.

గజపతి రాజు ఊడ్చడం (చేరా పహారా): రథయాత్ర ప్రారంభమయ్యే ముందు పూరీ సంస్థానానికి చెందిన గజపతి మహారాజు బంగారు పట్టు పట్టిన మురకతో రథాల చుట్టూ ఊడుస్తారు. దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఈ ఆచారం ఒక ఉదాహరణ.

గాలికి ఎదురుగా జెండా: పూరీ ఆలయం గోపురంపై ఉండే జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతుంది. ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ.

ఆకలితో అలమటించే స్వామి: రథయాత్రకు కొద్ది రోజుల ముందు (స్నాన పూర్ణిమ తర్వాత) స్వామివారికి జ్వరం వస్తుందట. అందుకే 14 రోజుల పాటు గుడి తలుపులు మూసేసి స్వామివారికి కేవలం పత్యం (ఔషధాలు) మాత్రమే పెడతారు. దీన్నే ‘అనవసర కాలం’ అంటారు. ఆ తర్వాతే రథయాత్ర రోజున స్వామివారు కోలుకుని బయటకు వస్తారు.

కూలిపోని అన్న ప్రసాదం: పూరీ ఆలయంలో ప్రసాదాన్ని ఒకదానిపై ఒకటి 7 మట్టి పాత్రలు పెట్టి వండుతారు. అయితే అన్నింటికంటే.. పైన ఉన్న పాత్రలోని అన్నం మొదట ఉడుకుతుంది. కింద ఉన్నది చివరగా ఉడుకుతుంది.

సనాతన ధర్మంలో పూరీ జగన్నాథ రథయాత్రకు.. ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కులమత భేదాలు లేకుండా.. అందరూ కలిసి ఆ జగన్నాథుడి రథాన్ని లాగడం సంస్కృతికి అద్దం పడుతుంది. ఈ ఏడాది జూలై 16న ప్రారంభమయ్యే ఈ మహత్తర రథోత్సవాన్ని వీక్షించి, ఆ జగన్నాథుడి కృపకు పాత్రులు అవ్వండి. జై జగన్నాథ్.

Related News

గురువారం ఈ చిన్న వస్తువులను దానం చేస్తే.. మీ ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు!

సోమవారం శివలింగానికి ఇవి సమర్పిస్తే చాలు.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి!

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

Big Stories

×