Thursday Charity Tips: హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం వారంలో ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే గురువారానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గురువారాన్ని బృహస్పతి (గురు దేవుడు), లక్ష్మీనారాయణుల రోజుగా భావిస్తారు. జాతకంలో గురు గ్రహం బలంగా ఉంటే సంపద, కీర్తి,విజయం అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. ఒకవేళ మీ పనులు మధ్యలోనే ఆగిపోతున్నా, చేతిలో రూపాయి నిలవకపోయినా.. గురువారం నాడు చేసే కొన్ని ప్రత్యేక దానాలు మీ తలరాతను మార్చేస్తాయి. మరి మీ అదృష్టాన్ని పెంచే గురువార దానాల విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గురు గ్రహ అనుగ్రహం కోసం దానం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి.. అత్యంత ఇష్టమైన రంగు పసుపు. కాబట్టి గురువారం నాడు చేసే దానాలలో పసుపు రంగు వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని వల్ల మీ ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ వైబ్స్ వస్తాయి.
1. పసుపు ధాన్యాలు ,పప్పులు:
గురువారం నాడు శనగపప్పు లేదా శనగపిండి దానం చేయడం చాలా శ్రేష్ఠం.
ఎలా చేయాలి?: ఏదైనా గుడిలో లేదా అవసరమైన పేదవారికి కేజీ లేదా అరకేజీ శనగపప్పును దానం చేయండి.
ఫలితం: దీనివల్ల మీ జాతకంలో ఉన్న గురు దోషాలు తొలగిపోతాయి. వ్యాపారంలో నష్టాలు తగ్గి, లాభాల బాట పడతారు.
2. పసుపు రంగు వస్త్రాలు:
బట్టలను దానం చేయడం ఎప్పుడూ మంచిదే.. కానీ గురువారం నాడు పసుపు రంగు బట్టలను దానం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.
ఎలా చేయాలి?: ఒక కొత్త పసుపు రంగు బట్టలు (తువ్వాలు లేదా ధోవతి వంటివి) బ్రాహ్మణుడికి లేదా వృద్ధులకు దానం ఇవ్వండి.
ఫలితం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి ఈ దానం బాగా హెల్ప్ అవుతుంది.
3. తీపి పదార్థాలు , అరటిపండ్లు :
గురువారం నాడు పసుపు రంగులో ఉండే స్వీట్లు (లడ్డూ లేదా జిల్లేబీ వంటివి) లేదా పండిన అరటిపండ్లను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది.
ఎలా చేయాలి?: గురువారం ఉదయం పూజ ముగిసిన తర్వాత చిన్న పిల్లలకు లేదా పేదలకు అరటిపండ్లను పంచండి. అయితే గుర్తుంచుకోండి. గురువారం నాడు మీరు మాత్రం అరటిపండ్లను తినకూడదు.
ఫలితం: ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
4. పుస్తకాలు, విద్యా సామాగ్రి:
గురు దేవుడు అంటేనే జ్ఞానానికి అధిపతి. కాబట్టి చదువుకునే పిల్లలకు సహాయం చేయడం వల్ల గురు గ్రహం చాలా త్వరగా ప్రసన్నమవుతుంది.
ఎలా చేయాలి?: పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను దానం చేయండి.
ఫలితం: మీ పిల్లల చదువు బాగుంటుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న మానసిక అశాంతి, కుటుంబ కలహాలు తగ్గిపోతాయి.
5. కుంకుమపువ్వు లేదా పసుపు :
పసుపు కొమ్ములు లేదా కుంకుమపువ్వును దానం చేయడం వల్ల గురు బలం విపరీతంగా పెరుగుతుంది.
ఎలా చేయాలి?: గురువారం నాడు విష్ణుమూర్తి గుడికి వెళ్లి పసుపు లేదా కుంకుమపువ్వును సమర్పించండి.
ఫలితం: వివాహం కాక ఇబ్బంది పడుతున్న యువతీ యువకులకు ఈ దానం చేయడం వల్ల త్వరలోనే పెళ్లి ఘడియలు వస్తాయి. వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది.
దానం అనేది ఎప్పుడూ స్వార్థం లేకుండా.. మనస్ఫూర్తిగా చేయాలి. గురువారం నాడు పైన చెప్పిన వస్తువులను మీ శక్తి కొద్దీ దానం చేయడం వల్ల మీ అదృష్టం ప్రకాశించడమే కాదు.. ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. రాబోయే గురువారం నుంచే ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి చూడండి. మీ లైఫ్‌లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు.