BigTV English

Dil Raju about Naga Vamshi: ఒకప్పటి నన్ను నేను, నాగవంశీ లో వెతుక్కుంటున్నా

Dil Raju about Naga Vamshi: ఒకప్పటి నన్ను నేను, నాగవంశీ లో వెతుక్కుంటున్నా

Dil Raju on Naga Vamsi :  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. ఫిల్మ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు (Dil Raju), దిల్ సినిమాతో నిర్మాతగా అడుగులు వేశారు. వివి వినాయక్ (V.V Vinayak) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమా హిట్ అవడంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేస్తూ ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చారు. దిల్ సినిమాకి దర్శకుడు సుకుమార్ (Sukumar) రచయిత మరియు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు సుకుమార్. ఆర్య (Aarya) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లవ్ స్టోరీ ని ఇలా కూడా చెప్పొచ్చు అని సుకుమార్ ప్రూవ్ చేశాడు. ఆ సినిమాతోనే అల్లు అర్జున్ (Allu Arjun) కి కూడా మంచి స్టార్డం వచ్చింది.


Also Read : RRR Movie: బాహుబలి తర్వాత అలాంటి ఘనత ఆర్.ఆర్.ఆర్ కే.. గ్రేట్ భయ్యా..!

ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాతో భాస్కర్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అప్పట్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. చాలా సెంటర్స్ లో వంద రోజులకు పైగా ఆడింది ఈ సినిమా. రీసెంట్ గా ఈ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త బంగారులోకం (Kottha Bangaru Lokam) , బృందావనం (Brindhavanam), మిస్టర్ పర్ఫెక్ట్ (Mr perfect) వంటి ఎన్నో హిట్ సినిమాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. దిల్ రాజు జడ్జిమెంట్ కూడా ఒకప్పుడు అద్భుతంగా వర్కౌట్ అయ్యేది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఆ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అనే నమ్మకం కూడా చాలామందికి వచ్చేసింది. ఇక రీసెంట్ గా దిల్ రాజు కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అని మరో బ్యానర్ నిర్మించారు.


Also Read : Taapsee Pannu: పెద్ద హీరోలకు అలాంటి హీరోయిన్సే కావాలి.. బాలీవుడ్ స్టార్లపై తాప్సీ కాంట్రవర్షియల్ కామెంట్స్

ఒకప్పుడు దిల్ రాజు అంటే ఒక బ్రాండ్, ఇప్పుడు అదే ప్లేస్ ని భర్తీ చేసేటట్లు కనిపిస్తున్నాడు నాగ వంశీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే హారిక హాసిని బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్లో నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎన్నో హిట్ సినిమాలు ఇప్పటివరకు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చాయి. అలానే ఈ బ్యానర్ లో ప్రస్తుతం ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా ఈ బ్యానర్ లో వచ్చిన సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. తన సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటాడు నాగ వంశీ. ఆ విధంగా నాగ వంశీ ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్ వల్ల ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు దిల్ రాజు అలా కనిపిస్తూ ఉండేవారు. అందుకే ఈ సక్సెస్ మీట్ కి హాజరైన దిల్ రాజు నిర్మాత నాగవంశీ లో ఒకప్పుడు నన్ను నేను చూసుకుంటున్నాను అంటూ మాట్లాడారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×