Saleswaram Yatra : తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య దర్శనాలు మొదలయ్యాయి. సంవత్సరంలో ఐదు రోజులు మాత్రమే ఈగుడిని తెరుస్తారు. ఉగాది తరువాత తొలి పౌర్ణమితో జాతర ఆరంభమైంది. బుధవారం ప్రారంభమైన జాతర మూడ్రోజులపాటు సాగనున్నది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశానికి అనుమతిస్తారు. ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరిస్తుంటారు. .పున్నమి వెన్నెలలో చెంచుల కులదైవాన్ని దర్శించు కోవడం పూర్వజన్మ సుకృతమే. అందుకే రాళ్లు, రప్పలను సైతం లెక్క చేయకుండా దాదాపు 4 కిలోమీటర్ల మేర నడక మార్గాన వెళ్లి స్వామిని దర్శించుకోవడం అత్యంత సాహసోపేత యాత్రగానే చెప్పాలి.
ప్రకృతిరమణీయతతో అలరారుతున్న దట్టమైన గుడి, ఎత్తైన కొండలు పాలనురుగులా జాలువారే జలపాతం,ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్య్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం. నల్లమల కొండపై నుంచి జాలువారే జలపాతాలు.. పచ్చదనంతో నిండిన కొండలు.. కోనలు.. లోయలు.. గుహలు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయతే..ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో లింగమయ్య కొలువుదీరడం నల్లమల వాసుల అదృష్టం. చెంచుల కులదైవం పరమశివుడు దర్శనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. సలేశ్వరం జాతర ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది.
శ్రీశైలం-హైదరాబాద్ రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్లాలి. 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. నడక దారిలో 250 అడుగుల నుంచి 400 అడుగుల ఎత్తు ఉండే రెండు సమాంతర గుట్టలు ఉంటాయి. లోతైన లోయలోకి జలధార పడుతుంది. గుండం కొంత దూరం ఉండగానే.. లోయ అడుగు భాగానికి వెళ్లాల్సి ఉంటుంది. గుండం నుంచి పారే నీటి ప్రవాహం వెంట రెండు గుట్టల మధ్య ఇరుకైన లోయ ఉంటుంది. గుండంలోని నీరు అతి చల్లగా ఉంటుంది. ఎన్నో వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి మంచిదని.. భక్తులు నీటిని తీసుకెళ్తుంటారు. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి. ఈగుడి పూజారులు ఆదివాసీలే.
ప్రకృతిరమణీయతతో అలరారుతున్న దట్టమైన గుడి, ఎత్తైన కొండలు పాలనురుగులా జాలువారే జలపాతం,ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్య్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం.నిజాం రాజు అక్కడి ప్రకృతిఅందాలను చల్లదనానికి ముగ్ధుడై 100ఏళ్లకు ముందే అక్కడి వేసవి విడిదిని నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశాన్ని పర్హాబాద్ అంటారు. నిజాం కట్టడాలన్నీ ప్రస్తుతం శిథిలావాస్థలో ఉన్నాయి.