Hair Growth Tips :ప్రస్తుతం ప్రతిఒక్కరు జుట్టురాలిపోయే సమస్యతో బాధపడుతున్నారు. ఎన్నో రకాల మందులు వాడుతుంటారు. అయినా ప్రయోజనం ఉండదు, అయితే తలపై ఊడిపోయిన వెంట్రుకలను తిరిగి మొలిపించే శక్తి మన ఇంటి పరిసరాల్లో ఉండే మొక్కల్లోనే ఉందని చాలా మందికి తెలియదు. ముళ్ల వంగ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. దీనిని నేల వాకుడు, నేల ములక, కంటకారి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. పైనుంచి కిందవరకు ముళ్లతో ఉండే ఈ మొక్క ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
అంతేకాకుండా ఈ మొక్కను ఆయుర్వేదంలో బాగా వాడుతారు. కొందరు ఈ మొక్క కాయలను కూర కూడా వండుకుని తింటారు. బట్టతల, పేను కొరకడంతో ఊడిన జుట్టును మళ్లీ తిరిగి వచ్చేలా చేస్తుంది. ఎక్కువగా పండిన ముళ్లవంగ కాయలను తీసుకుని రసాన్ని తీసుకోవాలి. అందులో తేనె కలిపి జుట్టు ఊడిపోయిన ప్రదేశంలో కొన్నిరోజుల పాటు మర్దనా చేస్తూ ఉండటం వల్ల వెంట్రుకలు తిరిగి వస్తాయి. అంతేకాకుండా పక్వానికి వచ్చిన ఈ చెట్టు కాయలను తీసుకుని సగానికి కోసి గింజలను తీసి మిగతా గుజ్జు నుంచి తీసిన రసానికి సమానంగా మందార పువ్వుల రసాన్ని తీసుకుని కలపాలి, ఈ మిశ్రమాన్ని జుట్టు ఊడిన ప్రాంతంలో మర్దనా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముళ్ల వంగ మొక్క వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు ఉండవు. ముళ్లవంగ ఆకుల నుండి ముళ్లను తీసేసి ఆకుల రసం తీసుకోవాలి. దాన్ని తలకు రాసుకుని 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు రాలడంతో పాటు చుండ్రు సమస్య ఉండదు. కేవలం జుట్టు సమస్యలే కాకుండా చాలా వరకు అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా ముళ్ల వంగ బాగా ఉపయోగపడుతుంది. కీళ్ల, నడుం నొప్పితో బాధపడుతున్నవారు ఈ ముళ్ల వంగ మొక్క ఆకులను మెత్తగా నూరి దానిలో కొద్దిగా వేడి చేసిన వెన్న కలిపి నొప్పి ఉన్న చోట వేసి కట్టుకట్టుకోవాలి. ముళ్లవంగ కాయల నుంచి తీసిన రసంతో మాడుపై మర్దనా చేయడంతో తలనొప్పి వెంటనే తగ్గుతుంది. పిప్పి పన్ను నొప్పి ఉంటే పండిన ముళ్ల వంగ కాయలను తీసుకుని వాటిని కాల్చి ఆ పొగను నోటితో పీల్చడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ముళ్లవంగ ఆకుల రసంలో దూదిని ముంచి పిప్పి పన్నుపై ఉంచడంతో మంచి ఫలితం ఉంటుంది.
ముళ్లవంగ మొక్క వేరుకు విషాన్ని పోగొట్టే శక్తి ఉంటుంది. ఈ మొక్కవేరును నీటితో కలిపి అరగదీసి అందులో నిమ్మరసం కలిపి పాము, తేలు కుట్టిన దగ్గర రాయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. ముళ్ల వంగ మొక్కను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడంతో దంత సమస్యలు పోతాయి. మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించే శక్తి నేల వంగకు ఉంది. దీని వేరును ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఈ పౌడర్‌ను పరగడుపున రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకుని ఒక గ్లాస్ పెరుగులో కలుపుకుని తాగాలి. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకుపోతాయి.