Kenya Bus Accident: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి బస్సు అదుపు తప్పి నదిలో పడింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఐదుగురు భారతీయులు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సమీప ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. విహారయాత్రలో భాగంగా.. 28 మంది ప్రవాసభారతీయుల బృందం.. ఖతర్ నుంచి కెన్యాకు బయల్దేరింది. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న భారత హైకమిషన్ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
చనిపోయిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతిచెందిన ఐదుగురు కేరళకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
మవెలిక్కరకు చెందిన గీతా షోజి ఐజాక్(58) రూహి మెహ్రీ మహమ్మద్ (18 నెలలు) జస్నా కుట్టిక్కట్టుచలిల్(29) ఒట్టప్పలంకు చెందిన రియా ఆన్(41) టైరా రోడ్రిగ్స్ (8)లు గుర్తించారు.
Also Read: అమానుష ఘటన.. మైనర్ బాలికపై రెండేళ్లుగా 13 మంది..
ఇదిలా ఉంటే.. నిర్మల్ జిల్లాలో బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దిల్వార్పూర్ మండలానికి చెందిన షేక్ సనీఫ్ , సయ్యద్ అబ్రార్‌గా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
⚠️ A tragic road accident occurred in central Kenya, where a bus carrying tourists rolled over, resulting in six fatalities and 27 injuries.
Location — The accident took place at Gichaka, along the Ol Jororok-Nakuru road in Nyandarua County.
Cause — The exact cause of the bus… pic.twitter.com/QsNRk7o5cq
— Sir Adam ™ (@AdamMaina_) June 10, 2025