Shani Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు వాటి ప్రత్యేక ప్రభావాలకు ప్రసిద్ధి చెందాయి. న్యాయ కారకుడైన శని ప్రభావం అన్ని గ్రహాలపై ఉంటుంది. జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి, ఒక వ్యక్తికి శుభ లేదా అశుభ ఫలితాలు లభిస్తాయి. కానీ పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఆ వ్యక్తి మానసికంగా, ఆర్థికంగా, పనుల్లో అనేక రకాల అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. శని ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. అన్ని రాశుల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా శని పరిగణించబడుతుంది.
శని నెమ్మదిగా కదలడం వల్ల వ్యక్తి శని ప్రభావం కూడా చాలా కాలం ఉంటుంది. 28 ఏప్రిల్ 2025న ఉదయం 7:52 గంటలకు శని తన సొంత రాశిలోకి అంటే ఉత్తర భాద్రపదంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా వారి ఉద్యోగం, వ్యాపారంలో కూడా ఆశించిన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వారి జీవితంలో కూడా అనేక మార్పులు కూడా తీసుకువస్తుంది. మరి శని సంచారం వల్ల అధికంగా ప్రయోజనాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని రాశి మార్పు వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఏప్రిల్ 28 నుండి వృషభ రాశి వారికి సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా న్యాయానికి అధిపతి అయిన శని ప్రభావం కారణంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మీ పనులు పూర్తవుతాయి. కుటుంబంలోకి కొత్త వాహనం లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అంతే కాకుండా ఆఫీసుల్లో మీకు గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది.
కర్కాటక రాశి:
శని రాశి మార్పు కర్కాటక రాశి వారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఏప్రిల్ 28 నుండి మీరు శుభ వార్తలు వినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి. కోర్టు కేసుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అప్పుల నుండి విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే. మాత్రం ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రారంభించే పనులు కూడా మీకు అధిక లాభాలను కూడా అందిస్తాయి.
Also Read: హోళీ పండుగ ముందు రోజు కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..?
తులా రాశి:
శని సంచారం ఏప్రిల్ 28 నుండి మీకు అధిక లాభాలను అందిస్తుంది. అంతే కాకుండా మీరు చేసే పనుల్లో కూడా విజయాలను కూడా అందిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా మాధుర్యం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీ పనిలో మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. వ్యాపారంలో మీరు భారీ లాభాలు సంపాదిస్తారు. ప్రభుత్వ పనులలో తలెత్తే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అంతే కాకుండా ఆఫీసుల్లో మీరు చేసే పనులకు కూడా మంచి గుర్తింపు కలుగుతుంది. అంతే కాకుండా మీ పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి.