BigTV English
Advertisement

Paritala Sriram: బాబు షాక్.. పరిటాల శ్రీరామ్ ఫ్యూచర్ ఏంటి?

Paritala Sriram: బాబు షాక్.. పరిటాల శ్రీరామ్ ఫ్యూచర్ ఏంటి?

Paritala Sriram: టీడీపీ యువ నాయకుడు పరిటాల రవి ఓపికకు అధిష్టానం పరీక్ష పెడుతోంది. పదవుల పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇదిగో అదిగో అంటూ నిరేక్షించేలా చేస్తోంది. దాంతో టీడిపి అది నాయకత్వం మీద ధర్మవరం టీడీపీ కార్యకర్తలతో పాటు అనంతపురం జిల్లాలోని పరిటాల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అధిష్టానం మాటకు కట్టుబడి సీటు త్యాగం చేసిన తమ యువ నేతకు ఎందుకు ఇలా జరుగుతుందని టీడీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తుందంట. అసలు పరిటాల వారసుడి విషయంలో అధిష్టానం లెక్కలేంటి?


టీడీపీతో పరిటాల కుటుంబానికి 3 దశాబ్దాల అనుబంధం

పరిటాల.. ఆ పేరు అనంతపురం మాత్రమే కాకుండా రాష్ట్రంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి పరిచయం అక్కరలేని పేరు.. తెలుగు దేశం పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది పరిటాల కుటుంబానికి.. ఉమ్మడి అనంతపురం జిల్లానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిటాల రవి అభిమానులు ఉన్నారు. ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలను శాసించారు పరిటాల రవి.. 2004 వైఎస్ గాలిలో కూడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ 6 స్థానాలు గెలుపొందింది అంటే అది పరిటాల రవి చలవే.


ధర్మవరం టీడీపీని బలోపేతం చేసిన పరిటాల రవి

అయితే పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరామ్‌కు కాలం అసలు కలసి రావడం లేదు. 2019 ఎన్నికల్లో మొదటి సారి రాప్తాడు నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత రాప్తాడు టీడీపీ ఇన్చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆయన్ని అధిష్టానం ధర్మవరానికి మార్చింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీ లోకి వెళ్లిపోవడంతో టీడిపి అధినేత చంద్రబాబు ధర్మవరం బాధ్యతలను శ్రీరాం కు అప్పగించారు. ఇంఛార్జి బాధ్యతలు చేపట్టగానే శ్రీరాం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ధర్మవరం ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం స్థానం బీజేపీ కి వెళ్లడం అక్కడ నుంచి సత్య కుమార్ పోటీ చేయడం ఎంఎల్ఏ గా, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి.

ధర్మవరం టీడీపీ బాధ్యతలను పరిటాల శ్రీరామ్ భుజానికి ఎత్తుకున్నారు

వైసీపీ హయాంలో ధర్మవరం టిడిపి కేడర్ పూర్తిస్థాయిలో ఢీలా పడిన సమయంలో ధర్మవరం టీడీపీ బాధ్యతలను పరిటాల శ్రీరామ్ భుజానికి ఎత్తుకున్నారు. ధర్మవరం ప్రతి ప్రాంతం తిరుగుతూ ముఖ్యంగా వైసీపీకి అత్యంత పట్టుకున్న ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలపై ఫోకస్ పెంచి నాలుగేళ్లు పాటు ధర్మవరం టీడీపీ లో మంచి ఊపు తెచ్చారు. నిజానికి ధర్మవరం ప్రాంతం టీడీపీకి ఎప్పుడు కంచు కోటే.. కానీ గతంలో ఎంఎల్ఏ గా పని చేసిన గొనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి బీజేపీ లోకి జంప్ కావడంతో టీడిపి కుదేలైంది.

క్యాడర్‌లో పరిటాల కుటుంబానికి క్రేజ్

పరిటాల కుటుంబానికి ధర్మవరం ప్రాంతం కొత్తేమీ కాదు కానీ గత 20 ఏళ్లుగా రాప్తాడు కే పరిమితం కావడంతో ధర్మవరం ప్రాంతానికి దూరం అయ్యారు. అయితే క్యాడర్ లో పరిటాల కుటుంబానికి ఉన్న క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. సూరి టిడిపి కి హ్యాండ్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మవరం ప్రాంతానికి వారి అవసరం పడింది. ధర్మవరంలో అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీరామ్ క్యాడర్‌లో జోష్ నింపుతూ సైకిల్‌ని పరిగెత్తించే పనిలో పడ్డారు. పరిటాల శ్రీరామ్ కు టీడీపీ టికెట్ ఫిక్స్ అని సంబరపడ్డారు ధర్మవరం తమ్ముళ్లు.. టికెట్ దక్కకపోయినా అక్కడ బీజేపీ విజయంలో పరిటాల శ్రీరామ్ కీరోల్ పోషించారు.

Also Read: ఏపీలోనూ లిక్కర్ స్కామ్.. విజయసాయి లీక్స్‌తో త్వరలోనే అరెస్టులు

శ్రారామ్‌కు శాప్ పదవి దక్కుతుందని ఊహాగానాలు

ఇక అధికారంలోకి వచ్చిన తరువాత పరిటాల శ్రీరామ్ కి రాష్ట్రస్థాయిలో ఏదో ఒక పెద్ద పదవి వస్తుందని అభిమానులంతా ఆశించారు. దానికి తగ్గట్టే శాప్ చైర్మన్ అంటూ ఊహాగానాలు వినిపించాయి. ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. పొత్తు కోసం ధర్మవరం టికెట్ త్యాగం చేయడం దగ్గరుండి సత్యకుమార్‌ని గెలిపించడం ఆయనకు అడ్వాంటేజ్ గా మారాయని.. ఎమ్మెల్సీ పదవి కన్ఫామ్ అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా రాకపోవడంతో మరోసారి పరిటాల అభిమానులు ఢీలా పడిపోతున్నారు.

ఎమ్మెల్సీ దక్కక ఢీలా పడిన పరిటాల అభిమానులు

పార్టీ కోసం త్యాగం చేసిన పరిటాల శ్రీరామ్‌ని అధిష్టానం పరీక్షిస్తోందని.. ఆయన ఓపికను ఇంకా ఎన్నాళ్లు పరీక్షిస్తారని టీడిపి కార్యకర్తలు నిట్టురుస్తున్నారు. తమ యువనేతని ఇంకెంత కాలం ఖాళీగా ఉంచుతారని అదిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహాన్ని బయటికి వెల్లగక్కలేక లోలోపల దాచుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. చూడాలి మరి పరిటాల శ్రీరామ్ భవిష్యత్ ఎలా ఉండబోతుందో?

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×