Unknow facts of holi: హోళీ పండగకు ఒక రోజు ముందు కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? కామ దహనం చేసిన మరుసటి రోజే హోళీ వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..? అసలు హోళీకి.. కామ దహనానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? పరమశివుడి ఉగ్రరూపమైన మూడో కన్ను తెరవడానికి గల కారణమేంటో తెలుసా..?
హోళీ పండగ ఈ పేరు ఉంటేనే చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉల్లాసం వెల్లివిరుస్తుంది.. ఉత్సాహం ఉరకలేస్తుంది. ప్రతి ఒక్కరి ముఖంలో వెయ్యి వాల్టుల కరెంట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే హోళీ పండుగకు ఉన్న ప్రత్యేకత అటువంటిది. హోళీ పండుగ రోజు రంగులు చల్లుకుంటూ ఆనంద కేళీలో పరవశించిపోతారు ప్రజలు. హిందూ సాంప్రదాయ పండుగలలో ప్రతి ఒక్కరు హ్యాపీగా జరుపుకునే పండుగ హోళీ. అందుకే ఈ పండగకు అంత క్రేజ్ ఉంది. ఎంతో ఆనంద పారవశ్యంతో జరుపుకునే ఈ పండుగ వెనక ఒక విశాద గాథ ఉన్నట్టు పురాణాలలో చెప్పబడింది. అదే కాముడి దహనం. పరమశివుడు ఉగ్రరూపంలో మూడో కన్ను తెరచి మన్మథుడిని భస్మం చేయడం. అలాగే ఈ పండగకు మరో బాధాకరమైన ప్లాష్‌బ్యాక్ ఉన్నట్టు పండితులు చెప్తుంటారు.
పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురి చేస్తుంటాడట. అయితే ఆ రాక్షసుడిని సంహరించే శక్తి శివుడికి పుట్టిన కొడుకుకే ఉందని దేవతలు తెలుసుకుని శివుడికి, పర్వత రాజైన హిమవంతుడి కూతురు పార్వతికి పెళ్లి చేయాలని దేవతలు నిర్ణయించుకుని శివుడి దగ్గరకు వెళితే అప్పటికే సతీ వియోగంతో ఉన్న పరమశివుడు ఘోరమైన తపస్సులో ఉంటాడట. దీంతో దేవతలు ఏం చేయాలో తోచక ఆలోచిస్తుంటే.. వారికి ఒక ఆలోచన తట్టిందని అదే మన్మథుడిని రెచ్చగొట్టి పరమశివుడి మనసు ఎలాగైనా పార్వతి దేవి మీద పడేలా చేయాలని కోరతారట. దేవతలు కోరిక మేరకు మన్మథుడు తన దగ్గరున్న పూల బాణాలు శివుడిపై ప్రయోగించడంతో..
ముక్కటి తపోభంగం అవడంతో ఆయన కళ్లు తెరచి పార్వతిని చూసి వివాహమాడతాడట. అయితే తన తపస్సు కు భంగం కలగడానికి కారణం మన్మధుడే అని తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ఊగిపోతూ.. మూడో కన్ను తెరవడంతో మన్మథుడు భస్మమైపోతాడట. అయితే మన్మథుడి భస్మమై పోవడం చూసిన ఆయన భార్య రతీదేవి పతి వియోగంతో పరమశివుడిని ప్రార్థించగా శాంతించిన శివుడు మన్మథుడిని మళ్లీ బతికించాడని అయితే భౌతికంగా కాకుండా మానసికంగా మాత్రమే మన్మథుడు రతీదేవికి కనిపించేటట్టుగా శివుడు వరమిచ్చాడని పురాణాల ఉవాచ. అప్పటి నుంచి ప్రజలు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి భస్మం చేస్తుంటారని ఆ మంటల్లో చెడు దహించుకుపోయి.. మంచి కలగాలని కోరుకుంటారని హోళీకి ముందు రోజు ఇదంతా జరుపుకుంటారని హిందూ గ్రంథాలలో చెప్పబడింది.
ఇక మరో కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడి కొడుకైన ప్రహ్లాదుడు తన తండ్రి శత్రువైన విష్ణుమూర్తిని పూజిస్తుంటాడు. అయితే ప్రహ్లాదుడికి, హిరణ్యకశ్యపుడు ఎన్ని రకాలుగా చెప్పినా వినకపోయే సరికి చివరికి తన సోదరి అయిన రాక్షసి హోళికను పిలిచి తన మాయల ద్వారా ప్రహ్లాదుడిని మంట్లో వేసి చంపమని చెప్పడంతో.. ఆమె ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటే విష్ణువు వచ్చి ప్రహ్లాదుడిని కాపాడతాడు. హోళికా మాత్రం ఆ మంటట్లో చనిపోతుందని ఆమె దహనమైన రోజునే సంతోషంగా ప్రజలు హోళీ పండుగ ముందు రోజు హోళీకా దహనం చేసి మరుసటి రోజు ఉత్సవం జరుపుకుంటారని మరో కథనం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు