Speaker VS Jagadish Reddy: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడీగా సాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్‌ను అధికారాలు ఏంటే తేల్చాలంటూ ఏక వచనంతో సంభోదించారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్-బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసలేం సభలో ఏం జరిగింది ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార పార్టీ వర్సెస్ మాజీ మంత్రులుగా వ్యవహారం సాగింది. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి గవర్నర్ ప్రసంగంపై సెటైర్లు వేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. వాస్తవాలు మాట్లాడాలని జగదీష్‌రెడ్డికి సూచించారు. ఆ వెంటనే తలసాని జోక్యం చేసుకుని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేశారు. వెంటనే జోక్యం చేసుకున్న జగదీష్‌రెడ్డి.. స్పీకర్‌పై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఉద్దేశించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సహనం కోల్పోయి మాట్లాడవద్దని సూచించారు. మీరు సీనియర్ శాసనసభ్యులు, పదేళ్లు మంత్రిగా పని చేశారన్నారు. సభా సంప్రదాయాలు పక్కదారి పట్టించడం సబబు కాదన్నారు. స్పీకర్‌ను ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్దమన్నారు.
ALSO READ: హరీష్ రావుపై విప్ ఆది ఆగ్రహం.. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం
వెంటనే జోక్యం చేసుకున్నారు జగదీష్ రెడ్డి. మీరు మాట్లాడుతున్నది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు. సభ మీ ఒక్కరి సొంతం కాదంటూ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అందరి తరపున పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారని అన్నారు. ఇదేమీ మీ సొంతం కాదన్నారు. దీంతో అధికార పార్టీ భగ్గుమంది. స్పీకర్‌కు క్షమాపణలు చెప్పాలని పాలక పక్షం డిమాండ్ చేసింది.
వెంటనే శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన ప్రతీ మాట వెనక్కి తీసుకోవాల్సిదేనన్నారు. స్పీకర్‌కు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. స్పీకర్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీధర్‌బాబు ప్రసంగానికి సభ్యులు అడ్డు తగిలారు. సభ్యులు వ్యంగంగా నవ్వారు కాబట్టే అధికారం కోల్పోయారని సెటైర్లు వేశారు మంత్రి శ్రీధర్‌బాబు.
దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్-బీఆర్ఎస్ సభ్యుల వాగ్వాదంతో గందరగోళం నెలకొంది. ఈలోగా హరీషరావు జోక్యం చేసుకున్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏ మాత్రం తప్పులేదన్నారు. సభలో సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. వెంటనే జోక్యం చేసుకున్న జగదీష్ రెడ్డి, సభను ఆర్డర్‌లో పెడితే తాను మాట్లాడుతానన్నారు.
సభా సంప్రదాయాలు, స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులు ఏంటో తేలాలన్నారు. సభను ఆర్డర్‌లో పెడితే తాను మాట్లాడుతానన్నారు. కనీసం మర్యాద లేకుండా స్పీకర్‌ను ఏకవచనంతో మాట్లాడుతున్న సభ్యుడ్ని సభను నుంచి సస్పెండ్ చేయాలన్నారు అధికార పార్టీ సభ్యులు. దీనికి పోటీగా బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పొడియం దగ్గరగా వెళ్లారు.
ప్రతిపక్ష పార్టీకి కనీస గౌరవం ఇవ్వరా? అంటూ నినాదాలు చేశారు. దళిత స్పీకర్‌ను అవమానించిన జగదీష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలన్నది కాంగ్రెస్ డిమాండ్. ఈ ఆందోళనలతో నేపథ్యంలో సభ ఒక్కసారిగా వేడెక్కింది. పరిస్థితి గమనించిన స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్లుప్రకటించారు.
సభలో ఉండమంటే ఉంటా, లేదంటే వెళ్లిపోతానంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
స్పీకర్నే బెదిరించేలా మాట్లాడడం సరికాదని హెచ్చరించిన మంత్రి శ్రీధర్ బాబు pic.twitter.com/OKdBjmSjjJ
— BIG TV Breaking News (@bigtvtelugu) March 13, 2025
గవర్నర్ ప్రసంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
ఈ సభ మనందరిది.. ఇక్కడ అందరికీ సమాన హక్కు ఉంటుందంటూ సమాధానం pic.twitter.com/BgEPIttPkh
— BIG TV Breaking News (@bigtvtelugu) March 13, 2025