BigTV English

Padarasa Shiva Lingam : పరమశక్తిని ప్రసాదించే.. పాదరస శివలింగం

Padarasa Shiva Lingam : పరమశక్తిని ప్రసాదించే.. పాదరస శివలింగం
Padarasa Shiva Lingam

Padarasa Shiva Lingam : సాధారణంగా మనం ఆలయాల్లో రాతి శివలింగాలను చూస్తుంటాం. కొన్ని క్షేత్రాల్లో ఇసుక లింగం, స్వర్ణ లింగం, రజత లింగం, మరకత లింగం, చంద్రకాంత శిలా లింగం, స్ఫటిక లింగాలూ కనిపిస్తాయి. అయితే.. వీటన్నింటి కంటే.. పాదరస శివలింగం మరింత శ్రేష్టమైనదీ, విశిష్టత కలిగినదిగా పెద్దలు చెపుతారు.
దీనినే రసలింగం అనీ అంటారు. రసలింగ పూజలతో దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్య , సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ‘వాయవ్య సంహిత ‘ అనే వేద గ్రంధం చెబుతోంది. ఒక్కసారి పాదరస శివలింగాన్ని ఆరాధిస్తే అది కోటి లింగార్చనతో సమానమని, రసలింగాన్ని ఆరాధించిన వారికి శివలోకంలో పదవి లభిస్తుందనీ బ్రహ్మపురాణం చెబుతోంది.


ఘన, ద్రవ లక్షణాలున్న పాదరసం చలిస్తూ వుండే లోహం. కనుక దీనితో చేసిన శివలింగం స్ధిరంగా వుండదు. దానిని నిశ్ఛల స్ధితిలో వుంచాలంటే, అందులో విశేష శక్తి కలిగిన మూలికల రసం కలిపి ధృఢమైన పదార్ధంగా రూపొందించాలి. శివధాతువుగా చెప్పే పాదరసం, అమ్మవారి రూపమైన మూలికా రసం కలిస్తేనే అది పరిపూర్ణ పాదరస లింగంగా నిలుస్తుందని సిద్ధులు చెబుతారు. దివ్యశక్తులున్న సిద్ధపురుషులు, భూత , భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోగల మహర్షులు మాత్రమే దీనిని తయారుచేయగలరు. నిత్యం అనుష్టానాలను పాటిస్తూ, తగిన రీతిలో పూజించగలవారు మాత్రమే దీనిని ఇంటిలో పెట్టుకోవాలి.

గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలంలో, మందడం పంచాయితీకి చెందిన తాళ్లాయపాలెంలోని కోటిలింగేశ్వర శైవక్షేత్రంలో 250 కేజీల పాదరస శివలింగం ఉంది. ఇక.. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో పట్టణంలో ఉన్న శ్రీ రాజవిద్యాశ్రమంలోనూ పాదరస లింగాన్ని దర్శించుకోవచ్చు. దీనిని ఆశ్రమ పీఠాధిపతి 1984లో ప్రతిష్టించారు. మరొకటి.. నెల్లూరు జిల్లాలో నరసింహపురంలో పాదరస సదాశివ వీరాంజనేయ శివలింగం ఉంది. అలాగే.. మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని నగరంలోని సిద్ధాశ్రమంలో 1500 కేజీల పాదరస లింగం ఉంది. దీనికి తల తాకించి నమస్కరిస్తే నరాల సంబంధవ్యాధులు పోతాయని భక్తుల నమ్మకం. కోయంబత్తూరు ఈశా షౌండేషన్‌లోనూ రసలింగం పూజలందుకుంటోంది.


శుభముహూర్తంలో తపస్సంపన్నులచే పాదరస శివలింగాన్ని నిర్మింప చేసి, ఇంటిలో ప్రతిష్టించుకుని, రోజూ ఇంటి యజమాని పాదరస శివలింగానికి అభిషేకం, అర్చన చేస్తే.. ఇంటిలోని వాస్తుదోషాలు పూర్తిగా సమసిపోతాయి. సుఖసంతోషాలతో జీవిస్తున్న వారికి ఎదురయ్యే నరఘోషను, అలాంటి వ్యక్తుల మీద జరిగే తాంత్రిక ప్రయోగాలను రసలింగ పూజతో తొలగించుకోవచ్చు. రోజూ ఇంటిలో దీనిని పూజిస్తే.. పితృదోషం నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

తీవ్రమైన రోగాలున్నవారికి ఆహారంతో బాటు పాదరస లింగాభిషేకం చేసిన తీర్థాన్ని చెంచాడు ఇస్తే.. రోగ విముక్తులవుతారు. ఎన్ని వివాహప్రయత్నాలు చేసినా.. ఫలితం లేనివారు.. పాదరస శివలింగ పూజ చేస్తే.. 21 రోజుల్లోనే వివాహ బాంధవ్యం నిశ్చయం అవుతుంది.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×