BigTV English

Pregnancy In Winter : చలికాలంలో ఎక్కువగా గర్భం దాల్చుతున్న మహిళలు.. కారణమిదేనా..?

Pregnancy In Winter : చలికాలంలో ఎక్కువగా గర్భం దాల్చుతున్న మహిళలు.. కారణమిదేనా..?

Pregnancy In Winter : మన దేశంలో చాలా మంది పిల్లలు చలికాలంలోనే పుడుతున్నారని జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. చలికాలం కూల్ వెదర్ ‌వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ తలెత్తడం మినహా.. విహార యాత్రలకు చలి కాలం చాలా అనువైనది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ కాలంలోనే మహిళలు అధికంగా గర్భం చాల్చుతున్నారని స్పష్టమవుతోంది. ఎక్కువగా ప్రెగ్నెన్సీలు అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలోనే కన్ఫామ్ అవడం వెనుక జీవసంబధమైన కారణం ఉంది.


సాధాణంగా చలికాలంలో లైంగికపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయనే నానుడి ఉంది. అయితే ఇది నిజమైన కారణం కాదు. చలికాలంలో మహిళలు గర్భం దాల్చడానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి.

ఒక సర్వే ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ లేదా జులై, ఆగస్టులలో పిల్లలు ఎక్కువగా పుడుతున్నారు. ఈ సర్వేను బట్టి మహిళలు అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో గర్భం దాల్చుతున్నారని స్పష్టం అవుతోంది. దీని వెనుక జీవసంబంధమైన కారణం కూడా ఉంది. చలికాలంలో పురుషులు స్పెర్మ్ కౌంట్ 5-10 శాతం పెరుగుతుందని అనేక నివేదికలు పేర్కొంటున్నాయి. చలికాలంలో పురుషుల్లో సంతానోత్పత్తికి అవసమైన టెస్టోస్టిరాడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. స్పెర్మ్ మరింత సామర్థ్యంగా.. ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి.


జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ప్రచురించబడిన మరో నివేదిక ప్రకారం.. చలికాలం పురుషుల్లో స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది. జలుబు సమయంలో సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 70 మిలియన్ స్పెర్మ్ కనుగొనబడుతుంది. అదే వేరే కాలాల్లో ఒక మిల్లీలీటర్ వీర్యం సగటున 680,000 స్పెర్మ్‌లు ఉంటాయని ప్రచురించింది.

చలి కాలంలో స్పెర్మ్ వేగం 5 శాతం వరకు పెరుగుతుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఫలితంగా పిండం త్వరగా చేరుకోవడం ద్వారా ఫలదీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. చలికాలంలో స్పెర్మ్ మాత్రమే కాదు.. శరీరం శక్తిగా ఉంటుంది. ఫలితంగా.. శారీరక సంబంధం మరింత ఆనందదాయకంగా మారుతుంది. ఈ కాలంలో స్త్రీ శరీరంలో గుడ్డు ఫలదీకరణం కోసం పర్యావరణం మరింత అనుకూలిస్తుందని గైనకాజిస్టులు చెప్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×