BigTV English

Shani Pradosh Vrat 2024: శని ప్రదోష వ్రతం విశిష్టత.. పూజా నియమాలు

Shani Pradosh Vrat 2024: శని ప్రదోష వ్రతం విశిష్టత.. పూజా నియమాలు

Shani Pradosh Vrat 2024: శివుడితో పాటు శని అనుగ్రహం పొందడానికి శని ప్రదోష వ్రతాన్ని చేస్తారు. శని ప్రదోష వ్రతం ఆగస్టు 31వ తేదీన శనివారం రోజు జరుపుకోనున్నారు. ఈ రోజున శివుడితో పాటు శని దేవుడిని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు పెరగడంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు. శివుడికి అంకితమైన ప్రదోష వ్రత ఉపవాసం చాలా పవిత్రమైందిగా చెబుతుంటారు. హిందూ మతంలో త్రయోదశి రోజు ప్రదోష ఉపవాసం పాటించాలనే సాంప్రదాయం ఉంది.


శని ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత:

శని దేవుడు శిక్షకు అధిపతిగా చెబుతుంటారు. శివుడి శిష్యుడని అంటారు. శివుడు శనిని న్యాయానికి, శిక్షకు అధిపతిగా నియమించాడు. అందుచేత శివుడిని పూజిస్తే శని గ్రహ బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అందుకే శని ప్రదోష వ్రతం రోజున శివుడిని ప్రధానంగా పూజిస్తారు. ఇది జీవితంలో అన్ని దోషాలను తొలగిస్తుంది.


శని ప్రదోష వ్రతం యొక్క ప్రయోజనాలు:
సంతాన సంబంధిత సమస్యలు ఉన్న వారు శని ప్రదోష ఉపవాసం పాటించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శని గ్రహ స్థితి వల్ల ఇతర బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. శనీశ్వరుడి సడే సాతి జరుగుతుంటే ఈ రోజు పూజ చేయడం ద్వారా మంచి జరుగుతుంది.

శని ప్రదోష వ్రతం యొక్క పూజా విధానం:

శని ప్రదోష వ్రతం రోజున శివుడిని పూజించాలి. శివలింగానికి అభిషేకం నిర్వహించాలి. ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల నూనె దీపాన్ని శివుడి ముందు దీపాన్ని వెలిగించండి. శని దేవుడి మంత్రం అయిన ఓం శం శనైశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ రోజు పేదవాడికి ఆహారాన్ని దానంగా ఇవ్వండి. ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది.

శని ప్రదోషానికి నిశ్చయ పరిహారాలు:
శని ప్రదోషం రోజు ఉపవాసం ఉన్న రోజున రావి చెట్టును నాటడం మంచిది. చెట్టును నాటి దీనిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు ఎడమ చేతి మధ్య వేలుకు ఇనుప ఉంగరాన్ని ధరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పేదవాడికి ఆహారాన్ని దానంగా ఇవ్వండి. శ్రీకృష్ణుడు లేదా శివుడిని పూజించండి. మీ జాతకంలో సడే సాతీ జరుగుతున్నట్లయితే శని ప్రదోషం రోజు సాయంత్రం దేవుడి ముందు ఓం శం శనైశ్వరాయ నమః అని 11 ప్రదక్షిణలు చేయండి. పేదవాడికి ఆహారం తినిపించండి. ఇందులో తీపి ఏమీ ఉండకూడదు అని గుర్తుంచుకోండి. వీలైతే సాయంత్రం పూట శివాలయానికి కూడా వెళ్లండి. స్వామిని పూజించి భక్తితో మీ మనసులోని కోరికలను తెలియచేయండి.

Also Read:గణపతిని ఇంటికి తెచ్చే ముందు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

జాగ్రత్తలు :
శని ప్రదోష వ్రతం రోజు పరిశుభ్రంగా ఉండండి.

ఎలాంటి తప్పుడు ఆలోచనలు మనసులోకి రానివ్వకండి.

ఇంట్లో అందరూ గౌరవంగా మాట్లాడుకోండి. పెద్దలను అగౌరపరచకండి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×