BigTV English

Shiva Temple : బ్రిటిష్ వాళ్లు కట్టించిన శివాలయం గురించి విన్నారా..

Shiva Temple : బ్రిటిష్ వాళ్లు కట్టించిన శివాలయం గురించి విన్నారా..
Shiva Temple

Shiva Temple : భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో సాక్ష్యాత్తు పరమశివుడు ..ఓ బ్రిటిషర్ కి కనిపించాడని చెబుతున్న వాస్తవిక సంఘటన. 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు, ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేసేవాడు. ఒకసారి యుద్ధం రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. .కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్య మేరీకి పంపిస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. దీంతో ఆమె తీవ్రమైన మనోవేదానికి గురైంది.


భర్త జాడ కోసం ఎదురు చూడసాగింది. అయితే ఓ రోజు గుర్రం మీద బైధ్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తుండగా.. వేద మంత్రాలు విని గుడి లోపలికి వెళ్లింది. అక్కడ పూజారులు మహా శివుణ్ణి పూజించడాన్ని గమనించింది. పూజారులు ఆమె బాధను గ్రహించి పలకరించారు. కల్నల్ సంగతి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. పూజారులు ఆమెను ఓదార్చి మహా శివునికి ఆ బాధని చెప్పుకోమని అన్నారు. ఆమె శివునికి గోడును వెళ్లబోసుకుని ఇంటికి వెళ్లింది . ఆతర్వాత ప్రతిరోజూ శివున్ని భక్తితో కొలుచింది. భర్త క్షేమంగా ఇంటికి వస్తే బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని మనసులో కోరుకుంది.

ఆ తర్వాత కొన్ని రోజులకే కల్నల్ నుండి ఉత్తరం వచ్చింది. తాను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్లు కల్నల్ ఉత్తరంలో తెలిపాడు. శత్రువులు చుట్టూ ముట్టిన సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా.. అక్కడ ఒక భారతదేశపు మహా యోగి వెలుగుతూ కనిపించాడని.. ఆయన పులి చర్మం ధరించి.. మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని.. ఆసాధువు విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాసుకొచ్చాడు.


సాధువు మేధస్సుకు, తేజస్సుకి శత్రుసైనికులు వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు. యోగి వల్లే తాము విజయం సాధించమన్నాడు. మహసాధువు కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయన్నాడు. అంతేకాక నీవు భక్తితో తనని పూజిస్తున్నావని.. అందుకే రక్షించడానికి వచ్చాడని యోగి తనతో చెప్పినట్లు కల్నల్ ఉత్తరంలో తెలిపాడు. కొన్ని రోజులు గడిచాక కల్నల్ ఇంటికి చేరుకున్నాక బైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. గుడిలో ఉన్న మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఆయనే అంటూ ఆశ్చర్యపోయాడు. అప్పటి నుండి కల్నల్, మేరీ దంపతులు మహా శివునికి అపార భక్తులుగా మారిపోయారు. అనంతరం బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×