BigTV English

Lokesh Kodali: లోకేశ్ ది తెలంగాణ డీఎన్ఏ.. మళ్లీ కొడాలి నాని కలకలం

Lokesh Kodali: లోకేశ్ ది తెలంగాణ డీఎన్ఏ.. మళ్లీ కొడాలి నాని కలకలం

Lokesh Kodali: మాజీ మంత్రి కొడాలి నాని నోటి దురుసు అసలేమాత్రం తగ్గలేదు. లోకేశ్ పై తగ్గేదేలే అన్నట్టు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా పాత గాయాన్ని పరోక్షంగా మళ్లీ కెలికారు. నేరుగా ఆ మాట అనకున్నా.. ఆ డైలాగ్ కు అర్థం అదేనంటూ సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ కొడాలి నాని.. లోకేశ్ ను ఏమన్నారంటే..


సీఎం జగన్‌ డీఎన్‌ఏ రాయలసీమది.. లోకేష్‌ డీఎన్‌ఏ తెలంగాణది.. అంటూ కొడాలి నాని కాంట్రవర్సీ స్టేట్ మెంట్ చేశారు. తెలంగాణలో పుట్టి, అక్కడే పెరిగి ఇక్కడ యాత్ర చేస్తున్నాడని మండిపడ్డారు. తాను బూతులు మాట్లాడతాను అనే వాళ్లకి చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడే మాటలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు కొడాలి నాని.

చంద్రబాబు 2 ఎకరాల నుంచి 2 లక్షల ఎకరాలు ఎలా సంపాదించారని నిలదీశారు కొడాలి. ఎన్టీఆర్‌ వారసులు అందరూ సామాన్యుల్లా బ్రతుకుతున్నారని.. చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తి అని నాని ఫైర్ అయ్యారు.


మిగతా విమర్శలన్నీ రొటీనే కానీ.. లోకేశ్ ది తెలంగాణ డీఎన్ఏ.. అంటూ కొడాలి చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో మరోరకంగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్లా ఉన్నాయని కొందరు అంటున్నారు. లోకేశ్ నాన్ లోకల్ అంటే సరిపోయేది కానీ.. లోకేశ్ డీఎన్ఏ తెలంగాణది అనడం వల్ల.. అందులోనూ కొడాలి అనడంతో.. మీనింగ్ మరోలా వినిపిస్తోందని నెటిజన్లు నానారకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Related News

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Big Stories

×