BigTV English

Shivaratri Jagaram : శివరాత్రి జాగారం చేయలేని వాళ్లు ఇలా చేయండి

Shivaratri Jagaram : శివరాత్రి జాగారం చేయలేని వాళ్లు ఇలా చేయండి
Shivaratri Jagaram

Shivaratri Jagaram : పరమశివుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రి. యావత్‌ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే… మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం, శివార్చన, జాగరణ… శివరాత్రి నాడు ఆచరించాల్సిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధ‌భాగమిచ్చిన అర్ధ‌నారీశ్వరుడు. తనను యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు.


పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహా శివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ‘శివ’ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్ధం. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం తినకూడదు. మద్యపానం చేయకూడదు. శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందు తల స్నానం చేసి శివదర్శనం చేసుకోవాలి. శివదర్శనం చేసుకొని, శివనామస్మరణతో ఉపవాసం వుండాలి. రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి.

శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని సూచిస్తున్నారు.ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. రాత్రి జాగరణ చేయలేని వాళ్ళు రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలంలో శివ నామస్మరణ చేసి సమీపంలోని ఎక్కడైనా గుళ్లో కానీ లేదా ఇంట్లో కానీ కొన్ని స్తోత్రాలను పెట్టుకొని కాసేపు విని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని స్వామివారికి దండం పెట్టుకొని వెళ్లి పడుకోవచ్చు


Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×