E-Paper
Advertisement

Loan Offer : ఎస్‌బీఐ భారీ లోన్ ఆఫర్.. ఎవరికంటే..

Loan Offer : ఎస్‌బీఐ భారీ లోన్ ఆఫర్.. ఎవరికంటే..
Advertisement

Loan Offer : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.. స్వయం సహాయక బృందాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తి క్యాంపైన్‌లో భాగంగా ఈ రుణాలు మంజూరు చేస్తోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు ఈ రుణాలు పొందాలంటే… మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

1992లో ఎస్‌హెచ్‌జీ-క్రెడిట్ లింకేజీ ప్రోగ్రామ్ ప్రారంభం కాగా… 2022 అక్టోబర్ 1న ఎస్‌హెచ్‌జీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది… ఎస్‌బీఐ. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప‌మెంట్-నాబార్డ్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదలైన ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ చురుగ్గా పాల్గొంటోంది. ఎస్‌బీఐ ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తిలో భాగంగా అన్ని జిల్లాల్లోని మహిళా గ్రామీణ బృందాలు 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకునే గ్రూపులకు… ఒక ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ వర్తిస్తుంది. అదే రూ.5 లక్షలకు పైగా రుణం తీసుకుంటే 9 శాతం వడ్డీ వసూలు చేస్తారు.

Advertisement

స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు, మార్జిన్ లేకుండా ఎస్‌బీఐ రుణాలిస్తోంది. మహిళా గ్రామీణ బృందాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య లోన్ తీసుకుంటే… క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ కవరేజీ కూడా లభిస్తుంది. అయితే రుణాలు మంజూరు చేసేందుకు డిపాజిట్లు చేయాలని ఎస్‌బీఐ ఎలాంటి ఒత్తిడి చేయదు. 2022 మార్చి 31 నాటికి మొత్తం రూ.24,023 కోట్ల రుణాలను స్వయం సహాయక బృందాలకు ఎస్‌బీఐ మంజూరు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న ఎస్‌హెచ్‌జీ రుణాల్లో ఎస్‌బీఐ వాటాయే 25.25 శాతం ఉంది. ఎస్‌హెచ్‌జీలకు టర్మ్ లోన్‌లు, క్యాష్ క్రెడిట్ లిమిట్స్ రెండింటినీ ఇస్తోంది… ఎస్‌బీఐ.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×