E-Paper
Advertisement

Puja Rules :దేవుడి ఫోటోల పూజకు విగ్రహారాధనకు ఒకే నియమాలు ఉండవా…

Puja Rules :దేవుడి ఫోటోల పూజకు విగ్రహారాధనకు ఒకే నియమాలు ఉండవా…

Puja Rules :కొంతమంది దేవుడి ఫోటో పెట్టుకుని పూజలు చేస్తుంటారు. మరికొందరూ విగ్రహం, ఫోటో రెండూ పూజిస్తారు. ప్రతిరోజూ అక్షత, పసుపు, కుంకుమ పెట్టి, పూలు పెట్టి, హారతిచ్చి, దేవుడికి పూజలు చేస్తాం. విగ్రహం,ఫోటో రెండూ సాధారణంగా ఒకే విధంగా పూజిస్తారు. కానీ జ్యోతిష్యం ప్రకారం ఇది తప్పు. విగ్రహారాధనకు, ఫోటో పూజకు చాలా తేడా ఉంది. ఈ భేదం తెలియకుండా అదే పూజ చేస్తే భగవంతుడిని పూజించిన ఫలితం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.

విగ్రహారాధనను సిద్ధారాధన అంటారు. ఫోటో పూజను మానస్ పూజ అంటారు. సిద్ధ ఆరాధన అంటే పూర్తి ఆచారాలు, పద్ధతుల ద్వారా చేసే ఆరాధన. మానస పూజ అంటే మానసికంగా అంటే మనసుతో చేసే పూజ. విగ్రహారాధన సమయంలో ఎప్పుడూ ఒక ఆసనం మీద కూర్చోవాలి. అయితే ఫొటోకు పూజలు చేస్తూ సీటుపై కూర్చోవాల్సిన పనిలేదు.

విగ్రహారాధన చేసేవారు ప్రతిరోజు జలాభిషేకం నిర్వహించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవుడి విగ్రహానికి ఆవు పాలు, నెయ్యి , తెనే వంటి తదితర పదార్థాలతో పాటు నీటితో అభిషేకం చేయవచ్చు. కానీ ఫోటో పూజ చేసేటప్పుడు జలాభిషేకం చేయాల్సిన అవసరం లేదు.ఇంట్లో లేదా దేవుడి వద్ద విగ్రహారాధన చేస్తే, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలి. అప్పుడే పూజ ప్రారంభించాలి. అయితే ఫోటో పూజలో దేవుడిని ప్రతిష్టించాల్సిన అవసరం లేదు. దేవుడి ఇంట్లో దేవుడి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు.

మూర్తి పూజ సమయంలో మీరు పూజించే విగ్రహం పరిమాణం కూడా ముఖ్యమైనది. ఇంట్లో మీరు పూజించే విగ్రహం 6 అంగుళాల కంటే పెద్దదిగా ఉండకూడదు. ఫోటో పూజలో ఎటువంటి నియమాలు వర్తించవు. ఏదైనా పెద్ద ఫోటోను ఉపయోగించవచ్చు. విగ్రహారాధన చేసేటప్పుడు దేవుని బీజ మంత్రాన్ని జపించవచ్చు. కానీ ఫోటో పూజలో బీజ మంత్రాలు పఠించడం నిషిద్ధం.
భగవంతుడిని పూజించేటప్పుడు స్నానం చేసి శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. అనారోగ్యంతో స్నానం చేయలేక పోతే ఫోటో పూజ చేసుకోవచ్చు. ఫోటో పూజలో స్నానం చేయాల్సిన అవసరం లేదు. విగ్రహారాధనలో స్నానం తప్పనిసరి. పూజ కోసం ఏ విగ్రహాన్ని ఉపయోగిస్తున్నారు అనేది కూడా విగ్రహ పూజ సమయంలో ముఖ్యమైనది. మీరు అష్టధాతువులు లేదా బంగారు-వెండితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించాలి. అయితే ఇవేవీ ఫోటోలకు వర్తించవు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×