BigTV English

Junk Food: ఇవేవీ జంక్ ఫుడ్ కాదని మీకు తెలుసా?

Junk Food: ఇవేవీ జంక్ ఫుడ్ కాదని మీకు తెలుసా?

Junk Food:ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడిపోయారు. జంక్ ఫుడ్ వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను చాలా మంది జంక్ ఫుడ్ అనుకుంటారు. కానీ నిజానికి అవి జంక్ ఫుడ్ కాదు, ఆరోగ్యకరమైనవి. వాటి రూపం చూసి జంక్ ఫుడ్‌గా భావిస్తుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాప్‌కార్న్‌ను అందరూ ఇష్టపడతారు.


చిన్నారుల నుంచి పెద్దల వరకు తింటుంటారు. నిజానికి పాప్‌కార్న్‌ జంక్‌ఫుడ్‌ కాదు చాలా ఆరోగ్యకరమైనది. పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పాప్‌కార్న్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి దీన్ని మంచి ఆహారంగా చెప్పవచ్చు. డార్క్‌ చాక్లెట్‌.. పేరుకే చాక్లెట్ కానీ ఇవి జంక్ ఫుడ్ కాదు. డార్క్ చాక్లెట్లో కోవా ఎక్కువ శాతం ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అందుకే తక్కువ మోతాదులో డార్క్ చాక్లెట్లను తింటే మంచిది. పీనట్ బట్టర్.. ప్యాక్ చేయబడిన ఆహారం. దీన్ని కూడా జంక్ ఫుడ్‌గా భావిస్తుంటారు.

నిజానికి ఇది ఆరోగ్యకరమైనది. వేరుశనగల నుంచి తయారుచేస్తారు కాబట్టి అందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. అవి మనకి తక్షణ శక్తినిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తాయి. మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అందుకే పీనట్ బటర్‌ నిర్భయంగా తినవచ్చు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిందే కానీ కొంత తక్కువ మోతాదులో మద్యం సేవిస్తే శరీరానికి మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ఇక మద్యంలో వైన్ ఒక రకానికి చెందినది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిర్దిష్టమైన మోతాదులో తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు మేలు చేస్తాయి. అవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఎలాంటి భయం లేకుండా వైన్ తీసుకోవచ్చు. ఇది జంక్ ఫుడ్ ఏ మాత్రం కాదని నిపుణులు చెబుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×