BigTV English

Makar Sankranti Special: సంక్రాంతికి ఆ మూడు వంటలే నైవేద్యంగా పెట్టాలా…

Makar Sankranti Special: సంక్రాంతికి ఆ మూడు వంటలే నైవేద్యంగా పెట్టాలా…

Makar Sankranti Special:తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి స్పెషల్స్ మరిచిపోలేం. పరవణ్ణం, గారెలు, నువ్వుల అరిసెలు వండుతున్నారు . వీటినే దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు. ఈ పిండి వంటలే చేయడం చేయడ వెనుక ఆచారం వెనుక పరమార్థం ఉన్నాయి. సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పిండివంటలు తయారు చేస్తారు. సంక్రాంతి నాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాదెలతో పాటు రైతుల మనసులూ నిండుగా ఉంటాయి. ఇలా కొత్తగా వచ్చిన బియ్యంతో నిజానికి ఎవరూ అన్నం వండుకోరు. ఎందుకంటే, కొత్త బియ్యం అజీర్తి చేస్తాయి. అందుకని వాటిని బెల్లంతో జోడించి పరమాన్నంగానో, అరిసెలుగానో చేసుకుంటారు. కొత్త బియ్యంతో వండిన పిండివంటలను నైవేద్యంగా అర్పించడం అంటే- పంట చేతికందినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలపడం.


సంక్రాంతి నాడు తయారు చేసే పిండివంటలన్నింటిలో నువ్వులు బాగా వాడతారు. అరిసెలకూ, సకినాలకూ నువ్వులు తప్పనిసరి. వీటిని వాడటం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంది. నువ్వులు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలగ పిండిని సైతం పారేయకుండా పశువులకు పెడతారు. అయితే, నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి కలిగిస్తాయి. అందుకనే మన ఆహారంలో మిగతా రోజుల్లో నువ్వులను పెద్దగా వాడరు. కానీ, సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి నిదానంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ సమయంలో నువ్వులను తినడం వల్ల వాతావరణానికి అనుగుణంగా శరీరం అలవాటు పడుతుంది.

తెలుగు నాట కనుమ నాడు తప్పనిసరిగా చేసుకునే పిండివంటల్లో గారెలు ఒకటి. కనుమ నాడు మినుములు తినాలి అని సామెత. ఇది వట్టి సామెత మాత్రమే కాదు, ఆచారం, సంప్రదాయం కూడా. గతించిన పెద్దలకు మొదట గారెలను నివేదించాలని కూడా అంటారు. మినులతో తయారు చేసే గారెలు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారస్థాయిలో ఉన్న సంక్రాంతి సమయంలో మినుములు తినడం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. అలాగే మినుములతో మినప సున్నుండలు కూడా చేస్తారు. వీటిని కొత్త అల్లుళ్లకు నెయ్యి దట్టించి తయారు చేస్తారు. ఇవి శరీరానికి బలిమిని, వీర్యపుష్టిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×