E-Paper
Advertisement

Shukra Nakshatra Parivartan: భరణి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ నాలుగు రాశులవారికి డబ్బే డబ్బు!

Shukra Nakshatra Parivartan: భరణి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ నాలుగు రాశులవారికి డబ్బే డబ్బు!
Advertisement

Shukra Nakshatra Parivartan 2024: గ్రహాలు రాశులు, నక్షత్రాలు మారినప్పుడల్లా.. కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. ఊహించని సంపద రావడంతో పాటు అన్నీ శుభాలే జరుగుతాయి. జ్యోతిషశాస్త్రంలో.. శుక్రుడిని వైవాహిక సుఖం, సౌఖ్యం, విలాసం, కీర్తిని ఇచ్చేవాడుగా పరిగణిస్తారు. మే 6వ తేదీన శుక్రుడు రాశి మారనున్నాడు. శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించడంతో.. నాలుగు రాశులవారికి సంపద రాబోతోంది. అలాగే ఊహించని విజయాలు వస్తాయి.

మేషరాశి..

Advertisement

ఈ రాశివారికి శుక్రుడి నక్షత్ర మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్తపెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. ఖర్చులు తగ్గుతాయి. కుటుంబంలో కూడా ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తాయి. వైవాహిక జీవితంలో సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.

మిథున రాశి..

Advertisement

మిథున రాశివారికి కూడా శుక్రుడు నక్షత్రం మారడం కొత్త లాభాలను, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. సౌఖ్యాలు, విలాసాలు పెరుగుతాయి. కొత్త వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మంచి సమయం. కొత్త ఒప్పందాలు జరుగుతాయి. భారీ లాభాలు వస్తాయి. కొత్తగా ఏదైనా పని ప్రారంభించేందుకు చాలా అనుకూల సమయం. మే 6 తర్వాత ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Also Read: నుదుటిపై తిలకంతో పాటు ఇది రాసుకుంటే.. మీకు డబ్బు లోటే ఉండదు..

సింహరాశి..

ఈ రాశివారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. మానవ సంబంధాలు బలపడుతాయి.

కన్యరాశి..

శుక్రుడు రాశిమారడం వల్ల కన్యరాశివారికి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. లాభాలు రావడం లేదని నిరాశలో ఉన్నవారికి ఇది మంచి సమయం. లాభాలు, అప్పులు అన్నీ తిరిగివస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. నూతన వాహనం, లేదా ఇంటిని కొనుగోలు చేస్తారు.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించడం లేదు)

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×