BigTV English

Priyanka Gandhi on PM Modi : ప్రధానిని మీరెప్పుడైనా టీవీల్లో చూశారా..?: ప్రియాంకా గాంధీ!

Priyanka Gandhi on PM Modi : ప్రధానిని మీరెప్పుడైనా టీవీల్లో చూశారా..?: ప్రియాంకా గాంధీ!

Priyanka Gandhi Comments on PM Modi(Political news telugu): ప్రధాని నరేంద్ర మోదీని మీరు ఎప్పుడైనా టీవీల్లో చూశారా..? అందులో ఆయన రాజులా కనిపిస్తారు.. అతను వేసుకున్న బట్టలు, జుట్టు ఏ మాత్రం చెక్కు చెదరకుండా రాజులా కనిపిస్తారని.. అలా రాజులా ఉన్న వ్యక్తికి ప్రజల బాధలు, సమస్యలు ఏం అర్థమవుతాయని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు.


శనివారం గుజరాత్ లో నిర్వహించిన ప్రచార సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు రాహుల్ గాంధీ.. యువరాజు అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అంతేధీటుగా ఆమె బదులిచ్చారు. తన సోదరుడిని ప్రధాని మోదీ యువరాజు అంటున్నారని.. అయితే, మీరు ఎప్పుడైనా టీవీలలో ప్రధానిని చూశారా..? చూస్తే అందులో అతను రాజులా కనిపిస్తారు.. అతను వేసుకున్న బట్టలు కానీ, జుట్టు కానీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా రాజులా కనిపిస్తారు.. అలాంటి వ్యక్తికి పేద ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయని ప్రియాంకా గాంధీ అన్నారు.

తన సోదరుడు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారన్నారు. 4 వేల కిలో మీటర్లు పాద యాత్ర చేసి సామాన్య ప్రజలు, కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారని.. ఆ సమస్యల పరిష్కారం కోసం రాహుల్ కృషి చేశారని ఆమె గుర్తుచేశారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తన సోదరుడు పాదయాత్ర చేశారని.. కానీ, మోదీ మాత్రం చక్రవర్తిలాగా కోటలోనే ఉంటారు.. బయటకు రారు.. ప్రజల కష్టాలు తెలుసుకోరంటూ ఆమె ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ పని తీరు బాగాలేదన్నారు. ఈ కారణంగా మనమంతా ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నామన్నారు.


Also Read: పూరీ అభ్యర్థిగా జై నారాయణ్ పట్నాయక్.. ప్రకటించిన కాంగ్రెస్..

అదేవిధంగా కర్ణాటకలో కూడా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ప్రధాని ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా మోదీ తగ్గించారని, ఇదే సరైన తరుణం.. దేశ రాజకీయాలను సరిదిద్దేందుకు అని ఆమె అన్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×