BigTV English

Create wealth:- సంపద సృష్టించే ఆరు పనులు

Create wealth:- సంపద సృష్టించే ఆరు పనులు

Create wealth:- మనీ ప్రపంచంలా మారిన రోజులివి. ఏ పని చేయాలన్నా ముందుగా కావలసింది డబ్బే అనే పరిస్థితి ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటారు. అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి ఇళ్ళల్లో కనిపిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోవడం, అనవసర ఖర్చులతోపాటు ఇంటికి సరైన వాస్తు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చని వాస్తు నిపుణుల మాట


ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కానీ సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవాలి. దీని ఇంట్లో ధనం నిలుస్తుంది. నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపు గోడకు పెట్టడం మంచిది. లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్‌ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది.

ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపాన్ని అయినా వెలగనిస్తూ ఉండాలి. ఎందుకంటే కాంతి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం దీన్ని యాంగ్‌ శక్తి అం టారు. ఇది చలనం తీసుకువస్తుంది. ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎంచుకొని ఇంటికి తెచ్చుకోవాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సం పద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. దీ నిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిది.


మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కారిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శక్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పెట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాకుండా ఒక వైపు ఒక మొక్కను పెడితే ఆ ఉధృతి తగ్గుతుంది. ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోమంటున్నారు నిపుణులు.

ఇంటికి గాజు కిటికీ తలుపులు ఉంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. కిటికీలకి క్రిస్టల్స్‌ వేలాడదీస్తే శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వాటిని తాకినపుడు అవి రంగు రంగుల అద్భుత ఇంద్రధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్క డ ఒక క్రిస్టల్‌ను వేలాడదీస్తే మీ కెరీర్‌ వృద్ధికి అది దోహదం చేస్తుందంటున్నారు. మీ క్యాష్‌ బాక్స్‌ను లేదా లాకర్‌ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×